ఎన్టీఆర్ కి అదొక తీరని అవమానం.. షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన డైరెక్టర్?

praveen
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో తన పాపులారిటీని పెంచుకొని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక మొన్నటికి మొన్న విడుదలైన దేవర సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ సక్సెస్ ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసేసింది.

 దీంతో ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఏంటో అందరికీ అర్థమయిపోయింది అని చెప్పాలి. ఇక ఈ మూవీ హిట్ తో పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ కూడా సార్ధకం అయిపోయింది. అయితే ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఒకానొక సమయంలో మాత్రం ప్రేక్షకుల నుంచి తిరస్కరణకు గురి అయ్యారు. ఇక ఎన్టీఆర్కు జరిగిన అవమానం ఏంటో దర్శక ధీరుడు రాజమౌళి కూడా చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పుకొచ్చాడు.

 జయప్రద హోస్టుగా 2010లో ప్రసారమైన జయప్రదం అనే టాక్ షోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. యమదొంగకు ముందు రాజమౌళి నాకు స్క్రిప్ట్ చెప్పలేదు. నిజాలు చెప్పాడు. నువ్వు అసలు ఏం బాగోలేవు అని మొహం మీద చెప్పేశాడు. ఈ లుక్ తోనే కదా సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ కొట్టింది అన్నట్లు నేను ఒక లుక్ ఇచ్చాను. అసలు నీకు అర్థం అవుతుందా.. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని సినిమాలు చూడటం లేదు. యూత్ అమ్మాయిలు ఇలా ఉంటే ఎలా ఇష్టపడతారు. నువ్వు బరువు తగ్గాలి అని రాజమౌళి అన్నాడు. సరే ఆ బరువు ఎలా తగ్గాలో నువ్వే చెప్పు నేను సలహా అడిగాను. అప్పుడు నేను లైఫో సెక్షన్ చేయించుకున్నాను. నేను ఎలా బరువు తగ్గితే మీకెందుకు అనుకున్నాను. బరువు తగ్గాక నేను వచ్చి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.


2006లో విడుదలైన రాఖీ సినిమాకు అయితే ఎన్టీఆర్ ఏకంగా అభిమానులు జీర్ణించుకోలేని విధంగా లావుగా మారిపోయారు. ఇప్పటికి కూడా తారక్ యాంటీ ఫ్యాన్స్ ఈ లుక్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకానొక సమయంలో బాడీ షేమింగ్ కి గురైన ఎన్టీఆర్.. వరుస ప్లాపులతో డీలా పడ్డాడు. అప్పుడు రాజమౌళి రంగంలోకి దిగి యమదొంగ కోసం బరువు తగ్గాల్సిందే అని సూచించడంతో.. లైఫో సెక్షన్ చేయించుకుని బరువు తగ్గిన ఎన్టీఆర్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: