హీరో నాగార్జునకు పాకిస్థాన్ నటుడి కూతురుకు ఉన్న సంబంధం తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా..!

Amruth kumar
సీనియర్ హీరోయిన్ టాబు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. హైదరాబాదులో పుట్టి పెరిగిన టబూ చైల‌డ్డ్‌ ఆర్టిస్ట్ గా 1982లో తొలిసారిగా వెండితెరపై మెరిసింది. తర్వాత 1991లో వెంకటేష్ హీరోగా వచ్చిన కూలి నెంబర్ 1న్ సినిమాలో హీరోయిన్గా నటించింది. తొలి సినిమాలోనే తన అందాలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత టబు బాలీవుడ్ లో కూడా నటించి సత్తా చాటింది. హిందీలో అజయ్ దేవగన్‌కు జంటగా విజయ్ పథ్ సినిమాలో నటించింది.. ఈ మూవీ ద్వారానే ఆమె బాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది. తర్వాత  అడపాదడపా సినిమాలు చేస్తూ మరలా తెలుగులో నాగార్జునకు జంటగా సిసింద్రీ సినిమాలో మొదటిసారిగా ఐటమ్ సాంగ్ లో కనిపించింది . ఆ తర్వాత మళ్లీ నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున కు జంటగా నటించింది.  

తమిళ్లోనే ప్రేమదేశం సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.. ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా టాబు సంచలనం సృష్టించింది. మలయాళం లో కూడా ఈమె కాలాపాని సినిమాతో మోహన్ లాల్ కు జంటగా నటించి అక్కడ కూడా సత్తా చాటింది.  ఇక టాబు ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.. టబు ఆమె సోదరి ఫరా కూడా బాలీవుడ్ హీరోయిన్లు టబు తల్లిదండ్రులు  జమాల్ అలీ హష్మీ, రిజ్వానా. ఆమె హైదరాబాద్‌కు చెందిన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. అయితే ఈమె తండ్రి పాకిస్తాన్లో ఒక నటుడు, అయిన తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోవడానికి పాకిస్తాన్ నుంచి ఇండియాకు చేరుకుని టబు తల్లి రిజ్వానాను పెళ్లి చేసుకున్నాడు.

జమాల్ అలీ.. గరం హవా మూవీ లో నటించారు. కానీ ఇక్కడ కూడా కెరీర్ అంతగా సాగలేదు. దీంతో ఆయన రిజ్వానాకు డైవర్స్ ఇచ్చేసి మళ్లీ పాకిస్థాన్ వెళ్లిపోయాడు.  టాబు స్కూలింగ్ అంతా హైదరాబాదులోనే సాగింది. ఆ తర్వాత ఆమె ముంబై షిఫ్ట్ అయింది. అక్కడే కాలేజీలో చదువుతుండగానే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం టాబు వయసు 50 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ అమ్మడు బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ సినిమాలు చేస్తుంది.  అయితే టాబు తెలుగులో స్టార్ హీరో నాగార్జున తోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే 50 సంవత్సరాలు దాటిన ఆమె పెళ్లి చేసుకోకపోవటానికి నాగార్జున కూడా కారణమని అంటారు. గతంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజముంది అనేది వారికే తెలియాలిి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: