తండ్రి టాలీవుడ్ లోనే స్టార్ హీరో.. తల్లి పాన్‌ ఇండియా హీరోయిన్ .. కానీ కొడుకులు మాత్రం డిజాస్టర్లు..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో ఎవరి రాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి సూపర్ హిట్ అవుతుంది అన్న సినిమా ఫ్లాఫై ఆ సినిమాలో నటించిన హీరోను చిత్ర పరిశ్రమలో లేకుండా కూడా చేస్తుంది. అదే ఇదేం చెత్త సినిమా రా అనుకున్న కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కొట్టి.. ఆ హీరోలకు తక్కువ టైంలోనే మంచి పేరుతో పాటు తిరుగులేని స్టార్డం తెచ్చి పెడతాయి. అలా ఎంతో మంచి సినిమాలో నటించిన రావాల్సిన గుర్తింపు మాత్రం రావడం లేదు అక్కినేని యువ హీరో నాగచైతన్యకు.. అసలు తెలుగులో ఇప్పుడున్న వర్సటైల్ యాక్టర్ లో నాగచైతన్య కూడా ఒకరు ..

సరైన సినిమా పడాలి కానీ పాన్ ఇండియా హీరో రేంజ్ కు వెళ్లే సత్తా ఉంది.. కష్టపడే తత్వంతో పాటు .. కొంత అదృష్టం కూడా ఉంటే బాగుండేది.  ఇక్కడ నిజానికి నాగచైతన్య సినిమాలు మరి అంత డిజాస్టర్ కూడా కావు అలా అని నిర్మాతలకు కాసులు వర్షాలు కూడా కురిపించవు కానీ స్టార్ హీరోగా మాత్రం చైతన్యయ ఎదగలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం చందు మండేటి దర్శకత్వంలో తండేల్‌ సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమాతో అయినా నాగా చైతన్య 100 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.

ఇక్కడ మరో అక్కినేని హీరో అఖిల్ సైతం చాలా కష్టపడతాడు కానీ కంటెంట్ వీక్ గా ఉండటం ఆయన సినిమాలన్నీ డిజాస్టర్ వైపుగానే  వెళుతున్నాయి. ఇండస్ట్రీకి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఒక సరైన హీట్ అందుకోలేక పోయాడు. ఇక ప్రస్తుతం అఖిల్ సాలిడ్ హీట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక తండ్రి నాగార్జున తెలుగులోనే స్టార్ హీరో అసలు నాగ్ అంటేనే అమ్మాయిలకు ఇప్పటికీ కలల రాకుమారుడు. ఇక ఆయన భార్య అమల సైతం స్టార్ హీరోయిన్ తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ మంచి విజయాలు అందుకొని పాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. మ‌రి వీరి కొడుకులు ఎప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: