దిల్ రాజును పవన్ అన్నిసార్లు ఆర్థిక కష్టాల నుంచి బయట పడేశాడా.. గ్రేట్ అంటున్న ఫ్యాన్స్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి దిల్ రాజు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సమయంలో అనేక సినిమాలతో భారీ నష్టాలను ఎదుర్కొన్నట్లు , చాలా తక్కువ సినిమాలతో మాత్రమే మంచి లాభాలను చూసినట్లు అనేక ఇంటర్వ్యూలలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన తొలిప్రేమ అనే సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేశాడు.

ఈ మూవీ తో తాను అద్భుతమైన లాభాలను అందుకున్నట్లు ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ కి వెళ్లినట్లు చాలా సార్లు చెప్పాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం తొలిప్రేమ సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఓ ఈవెంట్ను మేకర్స్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... తొలిప్రేమ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఎందుకు అంటే తొలిప్రేమ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను నేను దక్కించుకున్నాను. ఇక ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నాకు ఎప్పుడూ ఆర్థికంగా కష్టాలు ఎదురైన ఈ సినిమాను రీ రిలీస్ చేసేవాణ్ణి.

ప్రతిసారి కూడా ఈ సినిమా ద్వారా నాకు మంచి లాభాలు వస్తూ ఉండేవి. అలా అనేక సార్లు తొలిప్రేమ సినిమా నన్ను ఫైనాన్షియల్ కష్టాల నుండి బయట పడేసింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూట్స్ చేసిన దిల్ రాజు ఆ తర్వాత చాలా సంవత్సరాలకి పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dr

సంబంధిత వార్తలు: