గేమ్ చేంజర్ ఐదు భాషల్లో ఉందా.. లేదా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితం వరకు ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో వరుసగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను ఈ మూవీ బృందం వారు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలలో ఈ సినిమాను తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ వస్తున్నారు. అలాగే ఈ మూవీ నుండి విడుదల చేసిన రెండు పాటలను , టీజర్ను కూడా కేవలం ఈ మూడు భాషల్లోనే విడుదల చేశారు.

దానితో ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అవుతుందా ... లేదా అనే అనుమానాలు కొంత మంది లో వ్యక్తం అవుతున్నాయి. మరి శంకర్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా ఐదు భాషలలో విడుదల చేస్తాడా ..? లేక మూడు భాషల్లోనే విడుదల చేస్తాడా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: