బలగం వేణు 'ఎల్లమ్మ' సినిమాలో హీరో అతనా.. సెట్ అవుతాడా?

praveen
బలగం వేణు.. ఈ పేరు గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అనడంలో సందేహం లేదు. అయితే బలగం సినిమా ముందు వరకు వెనక్కి ఉన్న క్రేజ్ వేరు. బలగం సినిమాతో అతని కెరియర్ వేరు బలగం సినిమాకి ముందు అతను కెరియర్ వేరు. వేణు జబర్దస్త్ కమెడియన్ గా మాత్రమే అందరికీ తెలుసు. జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎన్నో ఏళ్ల పాటు అలరించిన వేణు ఇక కొంత స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు.

 అయితే ఇలా కమేడియన్ గా కొనసాగిన సమయంలో ఆయనలో ఏకంగా ఒక గొప్ప దర్శకుడు దాగి ఉన్నాడు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ బలగం అనే సినిమాను తీసి ఇండస్ట్రీ చూపును మొత్తం తన వైపుకు తిప్పుకోగలిగాడు వేణు. ఇక ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాకు ప్రపంచ స్థాయి అవార్డులు కూడా రావడంతో వేణు ప్రతిభా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. సాధారణంగా ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమాలు తీసిన తర్వాత.. నెక్స్ట్ సినిమాని అంతకుమించి హిట్ అయ్యేలా చూసుకోవాలి.

 ఈ క్రమంలోనే బలగం సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని సాధించిన వేణు కూడా.  తన తర్వాత సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఎల్లమ్మ అనే సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఉన్న కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.ఇలాంటి సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోబోతున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా ఎల్లమ్మ కథను పలువురు హీరోలకు వినిపించాడట వేణు. నానికి కథ వినిపించగా కథ నచ్చినప్పటికీ అప్పటికే తెలంగాణ నేపథ్యంలో దసరా సినిమా తీయడంతో ఈ సినిమా ఒప్పుకోలేదట. ఆ తర్వాత తేజ సజ్జకు వినిపించగా అంత పెద్ద పాత్ర తన వల్ల కాదు అన్నాడట.


వరుణ్ తేజ్ కూడా కథ నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారట. చివరికి ఈ కథ నితిన్ వద్దకు చేరిందట. అయితే నితిన్  ఈ సినిమాకు ఒప్పుకున్నాడట. సినిమా స్టార్ట్ చేయడానికి నిర్మాతలు నిర్ణయించారు అన్న విషయం తెలిసిందే.అయితే లవర్ బాయ్గా బాగా సెట్ అయింది ఎల్లమ్మ లాంటి వైవిద్యమైన కథను హ్యాండిల్ చేయగలడా అని ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: