రజినీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ?

Veldandi Saikiran
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన పని లేదన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ హీరోగా మారిపోయాడు నాని.  వాస్తవంగా ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న పాత్ర చేసి అయినా సక్సెస్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చాడు నాని. ఆ సమయంలో ఎంతో కష్టపడి...  ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అలా మొదలైంది లాంటి సినిమాతో... ఇండస్ట్రీని షేక్ చేశాడు నాని.

హీరో నాని సినిమాలు మినిమం గ్యారంటీగా హిట్ అవుతాయి. ఆయన ఎంచుకునే కథలు అందరికీ నచ్చుతాయి. అందుకే నాని సినిమాలు పక్కగా విజయవంతమవుతాయి.  తాజాగా హీరో నాని గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట టాలీవుడ్ యంగ్ హీరో నాని.

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్  హీరోగా చేసిన సినిమా వెట్టియన్. ఈ సినిమా మొన్న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకుంది చిత్ర బృందం. చాలామంది కీలక నటీనటులు ఇందులో... కీలక పాత్రలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వేట్టియన్ సినిమాలో నటించే అవకాశం హీరో నానికి కూడా వచ్చిందట.

ఈ సినిమాలో ఫాహద్ పజిల్  నటించిన దొంగ పాత్రకు మొదటగా హీరో నానిని అడిగారట. అయితే ఆ పాత్ర పెద్దగా ప్రభావం లేదని హీరో నాని సింపుల్గా రిజెక్ట్ చేశారట. దీంతో ఫాహద్ ఫాజిల్కు ఈ అవకాశం దక్కింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతని పాత్ర ఈ సినిమాలో పెద్దగా కనిపించలేదు. దీంతో హీరో నాని తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక అటు ఇదే సినిమాలో రానా మరియు  బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్... నటించినప్పటికీ వారి పాత్రలు కూడా పెద్దగా పేలలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: