సంక్రాంతి 2021 : 'క్రాక్' తో రవితేజ కమ్ బ్యాక్.. ఆ రెండు సినిమాలను దాటుకుని?

praveen
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. ఇక సంక్రాంతిni సెంటిమెంటుగా మార్చుకునే ఎంతోమంది స్టార్ హీరోలు.. ఇక తమ సినిమాలను అదే సమయంలో విడుదల చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే అందరూ స్టార్ హీరోలు ఇదే ఆలోచనతో ఉంటారు. కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఏర్పడుతూ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. దీంతో సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలబబోతున్నారు అన్నది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే అన్ని వైపుల నుంచి బలమైన పోటీ ఉండడంతో ఇక ఒక సినిమాలో కథ కథనం మాత్రమే కాదు అన్ని బాగుంటేనే ఆ సినిమా మిగతా సినిమాలతో పోటీని తట్టుకుని నిలబడి సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది. లేదంటే మిగతా స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇవ్వలేక ఇక ఫ్లాప్ గానే మిగిలిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సంక్రాంతి బరీలో ఇప్పుడు వరకు ఎంతో మంది స్టార్ హీరోలు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు మూవీకి మంచి టాక్ వచ్చినప్పటికీ ఇక పోటీ పడిన మరో మూవీ తో పోల్చి చూస్తే వెనుకబడిపోయి.. కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ గా మిగిలిపోయిన మూవీస్ కూడా చాలానే ఉన్నాయి.

 అయితే 2021 సంక్రాంతి బరిలో కూడా ఇలాగే స్టార్ హీరోల సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అప్పటికే వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ క్రాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ మలినేని, రవితేజ దర్శకత్వంలో గతంలో వచ్చిన మూవీస్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. కానీ అప్పటికే వరుస ప్లాప్ లు ఉండడంతో ఈ సినిమాతో ఆకట్టుకోగలడా అనే అనుమానం అందరిలో ఉంది. దీనికి తోడు ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేని రెడ్ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


 ఇంకోవైపు యంగ్ హీరో  బెల్లంకొండ శ్రీనివాస్ కూడా సంక్రాంతి బరిలో నిలిచాడు. అయితే ఈ మూడు సినిమాల్లో ఒక క్రాక్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఏకంగా రవితేజకు మంచి కం బ్యాక్ మూవీగా మారిపోయింది క్రాక్. రామ్ పోతినేని రెడ్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక అల్లుడు అదుర్స్ అయితే సంక్రాంతి బలిలో ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: