అమల బోరింగ్ అంటూ ఆ హీరోయిన్ పై మోజు పడుతున్న నాగార్జున.?

Pandrala Sravanthi
ఏంటి నాగార్జున కట్టుకున్న భార్యను బోరింగ్ అని మరో హీరోయిన్ పై మోజు పెంచుకున్నారా..ఇంతకీ నాగార్జున ని అంతలా ఆకట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరు?ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అమలని బోరింగ్ అని ఎందుకు అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగార్జునకు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లతో అఫైర్స్ వినిపించాయి. అందులో శ్రియ, టబు, అనుష్క, స్నేహ, రమ్యకృష్ణ వంటి ఎంతోమంది హీరొయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ఈ హీరోయిన్లు అందరికంటే ఎక్కువ ఆ హీరోయిన్ కే నాగార్జున కనెక్ట్ అయ్యారట. అమలని బోరింగ్ అని ఆ హీరోయిన్ కి ఇంప్రెస్ అయ్యానని,ఆమె నన్ను ఆకర్షించింది అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే నాగార్జున జయప్రదం షోలో జయప్రద అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు ఇస్తూ ఈ విషయాన్ని బయట పెట్టారు. 

అయితే ఇవి నాగార్జున ఇప్పుడు మాట్లాడిన మాటలు అయితే కావు.గతంలో జయప్రదం షోలో మాట్లాడిన మాటలు.అయితే దానికి సంబంధించిన వీడియోలో నాగార్జున ఏం మాట్లాడారంటే..ఈ మధ్యకాలంలో మిమ్మల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేసిన హీరోయిన్ ఎవరు.. ఎవరు బ్యూటిఫుల్ గా ఉంటారు అని నాగార్జునని జయప్రద ప్రశ్న అడగగా.. ఈ మధ్యకాలంలో నేను అనుష్కకి పడిపోయాను. ఆమె రోజు రోజుకి చాలా బ్యూటిఫుల్ గా మారిపోతుంది.


ఆమె నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. అయితే ఈ మాటల మధ్యలో జయప్రద అమల పేరు చెప్పగా అమల ఎప్పుడూ ఉండేదే కదా.. బోరింగ్.. కానీ నన్ను మాత్రం అనుష్క ఆకర్షించింది అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అనుష్కతో అప్పట్లో నాగార్జున కి ఎఫైర్ వార్తలు వినిపించింది నిజమే కావచ్చు. అందుకే అనుష్క కి అంతా అట్రాక్ట్ అయ్యారు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: