వార్నీ..అనుష్క బాహుబలి సినిమా చేసింది అందుకేనా..? షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన రాజమౌళి..!

Thota Jaya Madhuri
కొంతమంది హీరోయిన్స్ వెరీ వెరీ నాటిగా ఉంటారు . అందులో అనుష్క శెట్టి కూడా ఒకరు . అందరు హీరోయిన్స్ లా ఆమె కాదు. తను డబ్బుల కోసం సినిమా వర్క్ చేయదు.  ఆ సినిమా హిట్ అవుతుందా..? ప్లాప్ అవుతుందా..? అని కూడా ఆలోచించదు . అనుష్క కేవలం తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలను ఓకే చేస్తూ ఉంటుంది . అందుకే "వేదం , సైజ్ జీరో" లాంటి సినిమాలను కూడా ఓకే చేసింది .


ఆ సినిమాలు ఆమె కెరీర్ కి ఎంత రిస్క్ గా మారాయో అందరికీ తెలిసిందే . అయితే అలాంటి అనుష్క ..బాహుబలి సినిమా ఎందుకు చేసిందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు . ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా బయట పెట్టాడు . రాజమౌళి  స్టేజ్ పై మాట్లాడుతూ.." అసలు అనుష్క బాహుబలి సినిమా ఎందుకు చేసిందో తెలుసా..?" అంటూ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు .


అనుష్క వద్దకు ఆఫర్ తీసుకెళ్లినప్పుడు అనుష్క.." ఓకే నేను చేస్తాను అంటూ కండిషన్స్ పెట్టకుండానే కమిట్ అయ్యిందట. అంతేకాదు ఓ రోజు సరదాగా షూటింగ్ లో ఈ ప్రశ్న అడగ్గ.. వల్లి గారు ,రమా రాజమౌళి గారు, ప్రభాస్ ,రానా దగ్గుబాటి, కీరవాణి గారు అందరూ నాకు ఫ్రెండ్స్ ..వీళ్ళందరూ కలిసి పిక్నిక్ లా ఒక ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే అలాంటి అవకాశం నాకు వస్తే ఎందుకు మిస్ చేసుకుంటాను "అంటూ ఓపెన్ గానే చెప్పేసిందట . దీంతో రాజమౌళి షాక్ అయిపోయాడట . అంత మంచి కథను నీకు ఇస్తే కథ కోసం కాకుండా వీళ్ళ కోసం సినిమాను ఓకే చేసావా అంటూ అక్కడే  అడిగేసాడట. సరదాగా ఆరోజు జరిగిన సంభాషణను ఓపెన్ గా బయటపెట్టి రాజమౌళి.. అనుష్క శెట్టి ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ వస్తుందో అనే విషయాన్ని క్లియర్ గా చెప్పేసాడు..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: