ఎన్టీఆర్ కు జాన్వికపూర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..? వెరీ వెరీ స్పెషల్..!

Thota Jaya Madhuri
జాన్వి కపూర్ .. ఓ బాలీవుడ్ బ్యూటీ . అందాల ముద్దుగుమ్మ . దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు . తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్ ..తండ్రి బడా ప్రొడ్యూసర్ . ఇద్దరు బ్యాక్ గ్రౌండ్స్ హైలెట్ గానే ఉన్నాయి . అలాంటి హైలెట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన జాన్వి కపూర్ కెరియర్ ఏదో రేంజ్ లో దూసుకుపోవాలి . కానీ ఆమె అదృష్టమో దురదృష్టమో ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకోలేకపోయింది.


ఒక హిట్టు కూడా కొట్టలేకపోయింది . బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించినా అలాంటి ఒక హిట్ అందుకోలేకపోయింది . టాలీవుడ్ లో "దేవర" సినిమాతో అలాంటి హిట్ అందుకుందాము అంటూ చాలా చాలా ఆశపడింది.  పాపం ఆ ఆశ తీరలేదు.  "దేవర" సినిమా టాక్ ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే . జాన్వీకాపూర్ పర్ఫామెన్స్ పై ఇంకా బ్యాడ్ కామెంట్స్ కూడా వినిపించాయి . కాగా జాన్వీ కపూర్ ఈ సినిమా షూటింగ్ టైంలోనే ఎన్టీఆర్ బర్త్డ డే కారణంగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందట .


ఆ గిఫ్ట్ ఎన్టీఆర్ కి బాగానే నచ్చేసిందట . ఈ సినిమా షూటింగ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డే వచ్చింది. ఆ రోజు షూటింగ్లో ఉండాల్సి ఉంది . కానీ కొన్ని కారణాల చేత షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని మరి ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడానికి వెకేషన్ కి వెళ్ళిపోయాడు. అయితే ముందుగానే జాన్వి కపూర్ తారక్ బర్త డే సందర్భంగా ఒక స్పెషల్ కాస్ట్లీ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చిందట.  దానిమీద 999 అనే నెంబర్ ని కూడా ఉండేలా చూసుకుని ఉండటం గమనార్హం. తారక్ కి 9 నెంబర్ ఎంత సెంటిమెంట్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  సెంటిమెంట్ తో కూడిన వాచ్  ఇచ్చి జాన్వి కపూర్ - ఎన్టీఆర్ కి మోస్ట్ స్పెషల్గా మారిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: