మహేష్ తో ఉన్న ఈ పాప ఇప్పుడు యువత హాట్ ఫేవరెట్.. ఆమె ఫిగర్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Amruth kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసిన రాజమౌళి.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తీసుకురాబోతున్నాడు జక్కన్న.. అయితే మహేష్ చివరగా నటించిన గుంటూరు కారం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. స్టార్‌ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమాపై మహేష్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఇప్పటికే బాహుబలి , త్రిబుల్ ఆర్ట్ సినిమాతో రాజమౌళి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక మరి ఇప్పుడు మహేష్ తో తీయబోయే సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఇంకెక్కడి తీసుకువెళ్తాడో చూడాలి. అయితే ఎప్పుడో మహేష్ బాబుకు సంబంధించిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న చిన్నారి పాపని గుర్తుపట్టారా? ఆమె ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్... అమెకు టాలీవుడ్ లోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. యువతకు హాట్ ఫేవరెట్ గా ఆమె.. అయితే ఆమె ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలో కూడా నటించింది,, ఇప్పుడు హీరోయిన్గా దూసుకుపోతుంది ఇంతకు ఆమె ఎవరు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంత‌కి ఆమె మరి ఎవరో కాదు తెలుగు అమ్మాయి శ్రీ దివ్య..టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించింది. ఆ తర్వాత బస్టాప్ సినిమాతో హీరోయిన్గా మారింది .. ఇక శ్రీదివ్య కోలీవుడ్ లోనూ నటించి మప్పించింది.. ఇక తెలుగులో కేరింత సినిమాతో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. అలాగే తమిళ్లో కార్తీ , విశాల్ , శివ కార్తికేయ‌న్ లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించింది. ఇదిలా ఉంటే శ్రీ దివ్య సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. శ్రీ దివ్య ప్రస్తుతం తమిళ్ సినిమాల పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: