టాలీవుడ్ లో మరో విడాకులు.. ఆ స్టార్ కపుల్ క్లారిటీ ఇచ్చేసారుగా..?
ఇక శివబాలాజీ, మరో నటి మధుమితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అయితే వీరు ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు... అలా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఇరు కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగానే శివబాలాజీ పేరెంట్స్ జాతకాలు కలవలేదని పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే ఇదే విషయాన్ని మధుమతి కి శివబాలాజీ చెప్పగా ఈరోజుల్లో ఈ జాతకాలు ఏంటి అని దాదాపు సంవత్సర పాటు శివబాలాజీని దూరం పెట్టి మాట్లాడలేదట. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని శివబాలాజీ ఓ రోజు నేరుగా ఆమె ఫోన్ కి ఇక జీవితంలో నేను ఎప్పుడూ ఎవరిని విడిచి పెట్టనని మెసేజ్ కూడా పెట్టారట.
మెసేజ్ కి కరిగిపోయిన మధుమిత ఇద్దరి కుటుంబ సభ్యులకు సర్దిచెప్పి గ్రాండ్గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక కూడా వీరిద్దరూ ఎన్నో గొడవలు వచ్చాయట.. ముఖ్యంగా తొలి సంతానం పుట్టిన సమయంలో వీరి మధ్య చిన్న గొడవలు కారణంగా మధుమిత పుట్టింటికి వెళ్ళగా శివబాలాజీ తన కజిన్స్ దగ్గరికి వెళ్లిపోయారట. అయితే ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్న సమయంలో ఓసారి శివ బాలాజీ మధుమిత దూరంగా ఉన్నారనే విషయం తెలుసుకున్న శివ బాలాజీ కజిన్స్ నువ్వు మధుమిత ఇంటికి వెళ్లి ఆమెని తీసుకురమ్మని చెప్పడంతో మధుమితకు ఫోన్ చేసిన శివబాలాజీ నువ్వు మా ఇంటికి వచ్చి సారీ చెబుతానే వస్తాను అని తెగేసి చెప్పిందట మధుమిత. దాంతో చేసేదేమీ లేక శివ బాలాజీ మధుమిత ఇంటికి వెళ్లారట. ఇంటికి వెళ్ళాక సారీ చెప్పకుండానే శివ బాలాజీ తో కలిసి వచ్చేసిందట మధు. అలా దాదాపు వీళ్ళిద్దరు విడాకుల వరకు వెళ్లి మళ్లీ కలిసారంటూ ఓ ఇంటర్వ్యూలో మధుమిత చెప్పుకొచ్చింది.