బాల‌య్య అఖండ 2కు టైటిల్ మారుస్తున్నారా... కొత్త టైటిల్ ఇదేనా... ?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్  - ఇండియా హెరాల్డ్ ) . .

నందమూరి నట‌సింహ బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అనగానే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమాగా వచ్చిన అఖండ సినిమా ఒక ఎమోషనల్ స్పీరిచ్యువ‌ల్ జర్నీ. ఆ సినిమా మంచి హిట్ కొట్టి బాక్సాఫీస్ దగ్గర పూన‌కాలు తెప్పించింది. అఖండ సినిమా సూపర్ హిట్ అయినప్పటి నుంచి సీక్వెల్ మాట వినిపిస్తూనే ఉంది. బోయపాటి అఖండకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే ఆ టైం వచ్చింది. 14 రీల్స్‌ బ్యానర్ మీద రామ్ ఆచంట - గోపి ఆచంట నిర్మాతలుగా అఖండ 2 ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఈ నెల 16న శ్రీకారం చుడుతున్నారు. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సినిమాకు అఖండ 2 అన్నదే ముందుగా అనుకున్న టైటిల్.

అయితే దీనికి తాండవం అని ట్యాగ్‌లైన్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మరో మాట కూడా వినిపిస్తోంది. అఖండ 2 అన్నది పక్కన పెడితే అఖండ తాండవం అన్నది టైటిల్ గా పెడితే ఎలా ? ఉంటుందని బోయపాటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అఖండ సినిమాలో బాలయ్య అఘోరా గా కనిపించారు. అదే పాత్ర కొనసాగుతుంది. శివుడి తాండవం - శివతాండవం మాదిరిగా ఇప్పుడు అఖండ తాండవం ఉంటుంది అనుకోవాలి. అఖండ సినిమా ఎక్కడ ముగిసిందో అదే పాప పెద్దది అయిన దగ్గర్నుంచి రెండో భాగం మొదలవుతుందని తెలుస్తోంది.

బోయపాటి గత 7 - 8 నెలలుగా అఖండ 2 స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అది రెడీ కావడంతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పుడు ఉండదు అని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాడు. ఇది ఇంకా కొంచెం షూటింగ్ ఉంది.. అది డిసెంబర్ వరకు ఉంటుంది. అందువల్ల డిసెంబర్ రెండో వారం నుంచి అఖండ 2 సెట్స్ మీదకు వెళుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: