ఆ ఒక్క అలవాటు రవితేజ కెరీర్ కు శాపంగా మారిందా..? ఇప్పటికీ అది మార్చుకోలేకపోతున్నాడా..?

Thota Jaya Madhuri
కొన్నిసార్లు మనం ఊహించనవి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలాంటివి కామన్ గా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం.  కాగా మాస్ మహారాజ రవితేజ కెరియర్ లోను అలాగే జరిగింది . అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ..ఆ తర్వాత కమెడియన్గా.. ఆ తర్వాత హీరోగా మారి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు .మెగాస్టార్ చిరంజీవి ఎలా ఇండస్ట్రీలోకి ఎటువంటి హెల్ప్ లేకుండా వచ్చాడో.. ఆ తర్వాత అలాంటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు రవితేజ .


మెగాస్టార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ మెగాస్టార్ తో కలిసి సినిమాలో పోటీ చేసే స్థాయికి ఎదిగిపోయాడు.  కాగా మాస్ మహారాజు రవితేజ ఈ మధ్యకాలంలో హిట్ అందుకుందే లేదు. మరీ ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలు డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో పడిపోతున్నాయి . కలెక్షన్స్ కూడా అస్సలు చెప్పుకోతగ్గ రీతిలో ఉండడం లేదు . దానికి కారణం ఏంటో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు .


అయితే మరీ ముఖ్యంగా రవితేజ కి ఉన్న ఒక మంచి గుణమే ఆయన కెరీర్ ని డౌన్ ఫాల్ చేసింది అని అభిప్రాయపడుతున్నారు.  రవితేజ చాలా చాలా మంచివాడు . ఎంత మంచివాడు అంటే తన సినిమా రిలీజ్ అవుతుందని తెలిసిన కూడా పక్క హీరో సినిమాకు హెల్ప్ చేస్తాడు . ప్రమోషన్స్ కి సపోర్ట్ చేస్తాడు . అంత మంచివాడు మన రవి తేజ.  అందుకే ఆయన సినిమాలు డౌన్ ఫాల్ అవుతున్నాయి. తన సినిమాని పట్టించుకోకుండా పక్క హీరో సినిమాలకు ప్రమోషన్ నిర్వహిస్తే ఖచ్చితంగా మంచి హీరో అనిపించుకుంటాడేమో కానీ స్టార్ స్టేటస్ దక్కించుకోలేడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఆ ఒక్కటే రవితేజ కెరియర్ ఇలా పడిపోవడానికి కారణం అంటూ అభిప్రాయపడుతున్నారు . అయితే రవితేజ మాత్రం ఎంతమంది సజెషన్స్ ఇచ్చినా కూడా ఆయన ఆ గుణాన్ని మాత్రం వదులుకోవడం లేదు . పక్క వాళ్ళు అడిగితే ఎటువంటి హెల్ప్ అయినా సరే టకటకా చేసేస్తాడు . ఇప్పటికీ అలాగే చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: