ఏంటి నారా రోహిత్ కి కాబోయే భార్య సిరి లేళ్లకి నటుడు శ్రీ విష్ణు కి మధ్య అలాంటి రిలేషన్ ఉందా? ఇప్పటివరకు వీరి రిలేషన్ గురించి ఎవరికీ తెలియదే అనుకుంటారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం తెలిస్తే.మరి ఇంతకీ శ్రీ విష్ణు సిరి లేళ్ల మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఎప్పుడైతే నారా రోహిత్ పెళ్లికి రెడీ అయిపోయారు అని వార్తలు వినిపించాయో అప్పటినుండి నారా రోహిత్ సిరిలేళ్లకి సంబంధించిన ఎన్నో విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా నారా రోహిత్ కి కాబోయే భార్య సిరి లేళ్ల కి శ్రీవిష్ణు కి మధ్య ఉన్న సంబంధం గురించి నెట్టింట్లో ఓ వార్త వినిపిస్తోంది.ఇక వీరిద్దరి మధ్య మీరు అనుకుంటున్నట్లు ఎలాంటి చెడు బంధం లేదు.కానీ శ్రీ విష్ణు నారా రోహిత్ సిరి లేళ్ల ల పెళ్ళికి కారణమయ్యారట.అదేలా అంటే చాలామంది నారా రోహిత్ సిరి చాలా సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారని అనుకుంటున్నారు.
కానీ వీరిద్దరూ డేటింగ్ చేయలేదు. వీరిద్దరి మధ్య పరిచయం ప్రతినిధి -2 మూవీ షూటింగ్లోనే జరిగింది. అలాగే ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి ఓ రోజు రోహిత్ ఫ్రెండ్ శ్రీ విష్ణు రావడంతో నారా రోహిత్ ఈ మూవీ డైరెక్టర్ టీవీ5 మూర్తి, శ్రీ విష్ణు మాట్లాడుకుంటూ 40 ఏళ్లు వచ్చాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్ రా బాబు అని శ్రీ విష్ణు అడగగా.. నా ఫ్యామిలీని నన్ను బాగా చూసుకునే క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకాలిగా అని నారా రోహిత్ తనకి కాబోయే భార్యకి ఉండాల్సిన లక్షణాలు చెప్పడంతో అక్కడే ఉన్న టీవీ5 మూర్తి ఈ క్వాలిటీస్ అన్ని సిరి లో ఉన్నాయి అని చెప్పారు.
అంతేకాదు మీరిద్దరూ ఒకటే కమ్యూనిటీకి చెందినవారు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని టీవీ5 మూర్తి చెప్పారట. అయితే ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక నారా రోహిత్ సతమత పడుతుంటే వెంటనే శ్రీ విష్ణు ఆమె దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పారట. కానీ మొదట ఈ విషయం చెప్పగా ఆమె ప్రాంక్ చేస్తున్నారు అనుకుందట.కానీ ఆ తర్వాత నారా రోహిత్ కూడా పెళ్లి చేసుకుందామని అనడంతో సిరిలేళ్ల షాక్ అయిందట.ఇక వీరిద్దరూ ప్రేమలో పడ్డప్పటినుండి శ్రీ విష్ణుని సిరిలేళ్ల సొంత బ్రదర్ లాగే చూస్తుందట. అలా అప్పటినుండి వీరిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ల బాండింగ్ ఏర్పడింది