పూజా హెగ్డేను కాపాడలేకపోయిన స్టార్ హీరోస్.. వారిని నమ్మే కెరియర్ ఇలా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు , తమిళ్ , హిందీ సినీ పరిశ్రమలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో పూజ హెగ్డే ఒకరు. ఇప్పటివరకు తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో అనేక సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయి ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. గత కొంతకాలంగా మాత్రం ఈ బ్యూటీ చాలా సినిమాలలో నటించినా ఈమె నటించిన ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడం లేదు. ఇంత కాలం పాటు చాలా స్లో గా కెరీర్ను ముందుకు సాగించిన ఈ బ్యూటీ మళ్లీ వరస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. పూజా హెగ్డే మళ్లీ వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది.

ఈ మధ్యకాలంలో ఈమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తళపతి విజయ్ కొంత కాలం క్రితం బీస్ట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. కొంత కాలం క్రితం సల్మాన్ ఖాన్ "కిసి కా భాయ్ కసి కా జాన్" అనే హిందీ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ఆగింది. ఇలా తెలుగు , తమిళ్ , హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోల పక్కన నటించిన ఈ ముద్దుగుమ్మకు ఏ సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. ప్రస్తుతం మాత్రం ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: