ఈసారి అన్ స్టాపబుల్ సీజన్ 4 లోకి గెస్టులుగా వచ్చేది వీళ్లే..!?

Anilkumar
తెలుగు ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న టాక్ షోస్‌ లో ఆహా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ఒకట. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ సెలబ్రిటీ టాక్‌ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కు కూడా ముస్తాబవుతోంది. తాజాగా దసరా పండగను పురస్కరించుకుని కొత్త సీజన్ ఫస్ట్ లుక్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య.. సూపర్ హీరోగా కనిపించాడు. సుమారు నాలుగున్నర నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక అక్టోబరు 24వ నుంచి అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్‌ కానుంది.

  ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4లో ప్రశ్నలు కాస్త ఘాటుగా ఉంటాయని ఇప్పటికే బాలయ్య చెప్పారు. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ షో రెడీగా ఉందన్నారు. ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4లో పలు స్టార్ హీరోలు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. తొలి ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ‘పుష్ప 2’ టీమ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్, దర్శకుడు గోపీచంద్ మలినేలితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలో ఈ టాక్ షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి,

 అక్కినేని నాగార్జున కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.  బాలయ్య తాజాగా ‘అఖండ 2’ సినిమాను అనౌన్స్ చేశారు. ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘అఖండ 2: తాండవం’ అనే పేరును ఖరాలు చేశారు. అటు ప్రస్తుతం బాలయ్య, దర్శకుడు బాబీతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: