వెంకటేష్ వెంటాడుతున్న బ్యాట్ సెంటిమెంట్.. పోయినసారి అలా.. ఈసారి ఇలా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో కంటే కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలలో హీరోగా నటించి మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఈమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో వెంకటేష్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాలను అందుకోవడం లేదు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ "సైంధవ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శైలిష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది.

పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన సైన్ధవ్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశను ఎదుర్కొన్న వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే వెంకటేష్ , అనిల్ కాంబోలో రూపొందుతున్న మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమా గేమ్ చెంజర్ కూడా సంక్రాంతి బరిలో దింపబోతున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దానితో దిల్ రాజు వెంకటేష్ మూవీ ని సంక్రాంతి భరి నుండి తప్పిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగానే సంక్రాంతి భరి నుండి వెంకటేష్ మూవీ ని తప్పిస్తారా ... లేక గేమ్ చేంజర్ సినిమాతో పాటు దీన్ని కూడా విడుదల చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: