సినిమా ఇండస్ట్రీలో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొనే వారిలో నిర్మాతలు , ఆ తర్వాత డిస్టిబూటర్లు ఉంటారు అని చాలా మంది చాలా సందర్భాలలో చెప్పారు. ఇకపోతే ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో
దిల్ రాజు ఒకరు.
దిల్ రాజు తన కెరియర్ను మొదటగా డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు
దిల్ సినిమాతో నిర్మాతగా కెరియర్ను ప్రారంభించాడు. ఇక ప్రస్తుతం
దిల్ రాజు అటు డిస్ట్రిబ్యూటర్ గా , ఇటు నిర్మాతగా
సక్సెస్ ఫుల్ గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే
దిల్ రాజు కొంత కాలం క్రితం ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఆ ఇంటర్వ్యూలో భాగంగా
దిల్ రాజ్ కి మీరు నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలో ఏదైనా
సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా భారీ ఎదురు దెబ్బను తిన్నారా అనే ప్రశ్న ఎదురయింది. దానికి
దిల్ రాజు సమాధానం ఇస్తూ ... నేను
అల్లు అర్జున్ హీరోగా
సుకుమార్ దర్శకత్వంలో
ఆర్య సినిమాను నిర్మిస్తున్న సమయంలో
తేజ దర్శకత్వంలో రూపొందిన జై సినిమాను 2.25 కోట్ల ధరకు కొనుగోలు చేశాను. ఇక ఆ
సినిమా ద్వారా ఏకంగా రెండు కోట్లు పోయింది. ఆ
సినిమా ద్వారా భారీ ఎత్తున డబ్బులు పోయాయి అని
దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
దిల్ రాజు అనేక సినిమాలను నిర్మిస్తున్నాడు.
ఈయన ప్రస్తుతం మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా
శంకర్ దర్శకత్వంలో
గేమ్ చెంజర్ అనే
మూవీ ని నిర్మిస్తున్నాడు. అలాగే
విక్టరీ వెంకటేష్ హీరోగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ రెండు
మూవీ లను కూడా
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ రెండు సినిమాలు వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అవుతాయా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.