ప్రభాస్ లైఫ్ లో ఈ ముగ్గురు చాలా స్పెషల్.. అందుకు కారణం ఇదే..!
ఇదే క్రమంలో గతంలో ప్రభాస్ లైఫ్ లో ముగ్గురు హీరోయిన్లతో లవ్ స్టోరీ కొనసాగిందట.. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు నిజంగానే వారు ప్రభాస్‌ని లవ్ చేశార అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ముందుగా సీనియర్ హీరోయిన్ త్రిషతో రెబల్ స్టార్ కు ఎఫైర్ నడిచిందని వార్తలు వచ్చాయి.. వర్షం సినిమా టైంలో వీళ్ళిద్దరూ బాగా దగ్గరయ్యారు అనే రూమర్ కూడా వచ్చింది. అంతేకాకుండా పౌర్ణమి సినిమాలో కూడా వీళ్ళ కెమిస్ట్రీ బాగా పండించారు. ఆ తర్వాత బుజ్జిగాడు సినిమాలో కూడా కలిసి నటించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కొన్ని కారణాలు వలన వీళ్ళు విడిపోయారని టాక్ కూడా ఉంది.
అలాగే మరో స్టార్ హీరోయిన్ అనుష్కతో కూడా ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి.. అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కూడా అభిమానులు కోరుకుంటారు. కానీ అనుష్క మాత్రం ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు అంటూ ఆ వార్తలను కొట్టి పడేసింది. అలాగే మరో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో కూడా ప్రభాస్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరు కొంచెం క్లోజ్ గా ఉండటంతో ఈ వార్తలు వచ్చాయని అయితే ఇదంతా ఫేక్ అని వారి కొట్టి పారేశారు. ఇలా ఈ ముగ్గురు హీరయిన్లతో ప్రభాస్ ప్రేమాయణం నడిపించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.