అల్లు మెగా ఫ్యామిలీ ల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ లో నాగచైతన్య ఇరుక్కున్నారా.. అదెలా.. అసలు ఈ ఇష్యూలోకి నాగచైతన్య ఎందుకు వచ్చారు.. వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు నాగచైతన్య ఎందుకు బలవుతున్నాడు అనేది తెలియక చాలామంది షాక్ అవుతున్నారు.మరి ఇంతకీ అల్లు మెగా ఫ్యామిలీ ల కొట్లాటలోకి నాగచైతన్య ఎందుకు దూరారో ఇప్పుడు తెలుసుకుందాం.. గత కొద్ది రోజుల నుండి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.అయితే ఇవి ఫేక్ వార్తలు అని ఎప్పటికప్పుడు అసలు విషయం బయటపడ్డప్పటికీ ఈ రెండు ఫ్యామిలీలు చేసే కొన్ని కొన్ని పనుల వల్ల వీరిద్దరి మధ్య దూరం అయితే పెరిగినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వీరిద్దరి ఫ్యామిలీలో కోల్డ్ వార్ లోకి నాగచైతన్య ఇరుక్కున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది.ఇక అసలు విషయం ఏంటయ్యా అంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో క్రిస్మస్ కి వస్తారని ప్రచారం నడిచినప్పటికీ మళ్ళీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ చెబుతున్నారు.
అయితే ఇదే సంక్రాంతికి గేమ్ చేంజర్ కి పోటీగా అల్లు అరవింద్ నిర్మాతగా చేస్తున్న నాగచైతన్య తండేల్ మూవీ కూడా విడుదలబోతుందట. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజర్ మూవీపై చాలా నెగటివిటీ వచ్చింది. దీనికి తోడు రీసెంట్ గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు-2 సినిమా భారీ డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమా రిజల్ట్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఏమాత్రం చూపించినా కూడా రామ్ చరణ్ కి ఇబ్బందే అని చెప్పవచ్చు అలాగే ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుకుంటూ వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా చూసిన జనాలు మొదటి రివ్యూగా నెగిటివ్ రివ్యూ ఇస్తే మాత్రం కచ్చితంగా సినిమా చూడడానికి ఎవరు వెళ్ళరు.
అలాగే అదే సంక్రాంతికి విడుదలయ్యే తండేల్ మూవీ ఏ కాస్త హిట్ అయినా సినిమా బాగుందయ్యా అని అంటే చాలు ఇక గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్ నుండి తట్ట బుట్టా సర్దేయాల్సిందే అంటారు.అయితే ఈ వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో అల్లు అరవింద్ తండేల్ మూవీ తో మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ లో నాగచైతన్యను ఇరికించేసారుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్