2001కి మించిన సంక్రాంతి వార్ 2024 లో ఉండనుందా.. అదే జరిగితే హిటేక్కానున్న సంక్రాంతి..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక సినిమాలో పోటీలోకి దిగుతూ ఉంటాయి. 2001వ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అతి పెద్ద ఫైట్ నడిచింది. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవి పుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ మూడు మూవీలు కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి. ఇక ఈ సినిమాలలో నరసింహ నాయుడు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలవగా , మృగరాజు సినిమా ఫ్లాప్ అయ్యింది.  

దేవీపుత్రుడు సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక సినిమాలు విడుదల కానున్నాయి. దీనితో 2001 వ సంవత్సరానికి మించిన ఫైట్ వచ్చే సంవత్సరం సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమాను , బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటనలు వచ్చేసాయి.

ఇక టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తండేల్ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కుటుంబాలు అయినటువంటి మెగా , నందమూరి , అక్కినేని , దగ్గుపాటి కుటుంబాలు ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంటుంది. ఈ నలుగురు హీరోలతో పాటు సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న మజాకా సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: