బాలీవుడ్ హీరోయిన్ తో నాని రొమాన్స్ ?

Veldandi Saikiran
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది యంగ్ హీరోలు ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుంటే మరి కొంత మంది పడుతూ లేస్తూ ఉన్నారు.  మరి కొంతమంది ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మినిమం గ్యారంటీ ఉన్న హీరోలలో నాని అగ్రస్థానంలో ఉంటాడు.

 నాని సినిమా చేశాడు అంటే కచ్చితంగా హిట్ అవుతుంది. ఆయన ఎంచుకునే కథలు అలా ఉంటాయి. అందుకే ఇంత సక్సెస్ రేట్ తో దూసుకు వెళ్తున్నాడు నాని. హాయ్ నాన్న, అంతకుముందు దసరా, మొన్న ఇటీవల సరిపోదా శనివారం లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ అందుకున్నాడు  నాచురల్ స్టార్ నాని. అయితే ప్రస్తుతం దసరా కాంబినేషన్లో రిపీట్ చేయబోతున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల అలాగే నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఇప్పటికే దసరా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను థియేటర్కు రాబట్టగలిగింది దసరా. అందుకే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలతో.... మరో సినిమా చేస్తున్నాడు నాని. సికింద్రాబాద్ నగరం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. దసరా కంటే 100 రేట్లు బీభత్సంగా ఉంటుందని సమాచారం. ఊర మాస్ తో పాటు పిరియాడిక్ టచ్ కూడా ఉంటుందట. అయితే ఇలాంటి సినిమాలో నాని సరసన హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
 పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా వస్తున్న నేపద్యంలో... బాలీవుడ్ నుంచి బ్యూటీ ని దించేందుకు శ్రీకాంత్ ఓదెలా ప్రయత్నాలు చేస్తున్నారట. మొన్నటి వరకు దేవర బ్యూటీ జాన్వి కపూర్ అని.. ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జాన్వి కపూర్ కాకుండా.. శ్రద్ధా కపూర్ ను తెరపైకి తీసుకువస్తున్నారట. శ్రద్ధా కపూర్ కు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ బ్యూటీ ని ఎంచుకున్నారట చిత్ర బృంద సభ్యులు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: