టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. అయితే గతంలో వెంకీ, అనిల్ కాంబోలో ఎఫ్2,ఎఫ్3 సినిమాలు వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ రెండు సినిమాలు వెంకీ సొలో హీరోగా తెరకెక్కలేదు.. దీనితో వెంకటేష్ కు సోలోగా మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు అనిల్ సిద్ధం అవుతున్నాడు..వెంకీ, అనిల్ కాంబో లో వస్తున్న మూడో సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో క్రూసియల్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో న్యూ షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టారు..
వెంకటేష్‌తో పాటు ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి వెంకీ ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా తో అనిల్ వెంకీకి మంచి విజయం అందిస్తాడో లేదో చూడాలి..కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి రెండవ వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75 % పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కేవలం క్లైమాక్స్ మాత్రం పెండింగ్ ఉందని సమాచారం. వచ్చే నెల నవంబరు 14 నుంచి 19 వరకు సంక్రాంతికి వస్తున్నాం క్లైమాక్స్ షూట్ ప్రారంభం కానున్నట్టు యూనిట్ తెలిపింది. 25 వ తేదీ కల్లా పాచ్ వర్క్ లతో సహా సినిమా మొత్తం పూర్తి చేసేలా పక్క ప్లానింగ్ రూపొందించారని సమాచారం.. స్పీడ్ గా సినిమా షూట్ కంప్లిట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు..