టాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో శోభన్ బాబు ,
బాలకృష్ణ కూడా ఉంటారు. వీరిద్దరూ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక అద్భుతమైన స్థాయిని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే వీరి కాంబోలో కొన్ని సంవత్సరాల క్రితం అశ్వమేధం అనే
మూవీ రూపొందింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా అనుకున్న స్థాయి విజయం అందుకోలేదు. అసలు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో రాఘవేందర్రావు ఒకరు.
ఈయన చాలా మంది హీరోలకు అద్భుతమైన విజయాలను అందించాడు. ఇక
బాలకృష్ణ తో చాలా సినిమాలను తెరకెక్కించిన రాఘవేంద్రరావు , బాలకృష్ణ.కు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. దానితో కచ్చితంగా ఆయనకు విజయాన్ని అందించాలి అనే ఉద్దేశంతో రాఘవేందర్రావు ఓ
సినిమా చేయాలి అనుకున్నాడు. ఇక
అశ్విని దత్ ...
బాలకృష్ణ , రాఘవేంద్రరావు కాంబో మూవీని నిర్మించడానికి రెడీ అయ్యాడు. ఈయన కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని కొట్టాలి అనే ఉద్దేశంతో ఓ భారీ కాంబినేషన్ ను సెట్ చేశారు. అశ్వమేధం
మూవీ లో
బాలకృష్ణ , శోబన్ బాబు హీరోలుగా నటించగా
మీనా ,
నగ్మా హీరోయిన్లుగా నటించారు.
ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ 1992
డిసెంబర్ 25 వ తేదీన విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అద్దుకోలేదు.
ఇక
బాలకృష్ణ కు అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందించాలి అనుకున్న రాఘవేందర్రావు ఈ సారి కూడా విఫలం అయ్యాడు. అలాగే
అశ్విని దత్ కూడా అద్భుతమైన విజయాన్ని
బాలకృష్ణ కు అందించాలి అనుకున్నాడు. కానీ ఈ
సినిమా ద్వారా
అశ్విని దత్ కూడా
బాలకృష్ణ కు విజయాన్ని అందించలేకపోయాడు. ఇకపోతే ఈ సినిమాలోని
బాలకృష్ణ , శోభన్ బాబు నటనలకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు ఆ సమయంలో వచ్చాయి.