ఆరోజు ఆ తప్పు జరిగి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ సర్వనాశనం అయిపోయుండేదా..? బ్రతికిపోయాడు పో..!
అప్పట్లో ఈ కాంబో రచ్చ రంబోలా చేసింది. తెరపై వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది . జనాలు కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గజాలను కేవలం హీరోయిన్గా మాత్రమే చూసారు. కానీ గజాల ..జూనియర్ ఎన్టీఆర్ ని అంతకు మించిన రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసింది . మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ - గజాలను ప్రేమించింది అని .. ఆయనను పెళ్లి చేసుకోవాలి అనుకునింది అని ..అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి . దానికి తగ్గట్టే గజాల ఓ రోజు సూసైడ్ చేసుకోబోయి షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ సినిమాలో ఆమెను హీరోయిన్గా పెట్టలేదు అన్న మనస్థాపంతోనే ఆమె సూసైడ్ చేసుకోబోయింది అంటూ కూడా ప్రచారం జరిగింది.
అంతేనా జూనియర్ ఎన్టీఆర్ దానికి కారణమని .. జూనియర్ ఎన్టీఆర్ గజాలను వాడుకొని వదిలేస్తాడు అని కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడారు . అసలు రీజన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ది అసలు తప్పే లేదు . జూనియర్ ఎన్టీఆర్ సినిమాని సినిమా గానే చూశాడు . కానీ గజాల సినిమాకు మించిన స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయడమే అక్కడ పెద్ద రాద్ధాంతం జరగడానికి కారణమైంది . అయితే అటువంటి సిచువేషన్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా కూల్ గా గజాల హెల్త్ డీటెయిల్స్ ఫాలో అప్ చేసి సైలెంట్ గా ఉండిపోయాడు. తనను నెగిటివ్గా మాట్లాడిన వాళ్లను ఏమాత్రం కోప్పడకుండా వెళ్ళిపోయాడు . ఒకవేళ ఆనాడు గజాలకి ఏదైనా జరిగిఉంటే మాత్రం కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియల్ చిక్కుల్లో పడిఉండేది అనడంలో సందేహం లేదు . జూనియర్ ఎన్టీఆర్ నిజాయితీనే ఆయనను కాపాడింది. ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాల్లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు తారక్..!