దేవర కే తప్పలేదు.. ఈ యువ హీరోకు అంత ఈజీగా ఉంటుందా..?

Pulgam Srinivas
తెలుగు సినిమాలను కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ శాతం కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేసేవారు. ఏవో సంవత్సరానికి రెండు , మూడు సినిమాలు ఇతర భాషల్లో విడుదల అయ్యేవి. అలా విడుదల అయిన సినిమాలలో కూడా ఇతర భాష ప్రేమికులను అత్యంత ఆకట్టుకున్న సినిమాల సంఖ్య కూడా చాలా తక్కువే ఉండేది. కానీ బాహుబలి సినిమా ఎప్పుడు అయితే విడుదల అయ్యిందో అప్పటి నుండి తెలుగు సినిమా ఖ్యాతి భారీగా పెరిగింది. ఇతర భాష ప్రేమికులు కూడా తెలుగు సినిమాలు అంటే ఎంతో ఇష్టపడుతున్నారు. అనేక భాషలలో మన సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి.
 

ఏదేమైనా తమిళ ఇండస్ట్రీలో మాత్రం మన సినిమాలకు కాస్త ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మనం మాత్రం తమిళ సినిమాలను ఎంతో ఆదరిస్తూ ఉంటే వారు మాత్రం మన తెలుగు సినిమాలను ఆ స్థాయిలో ఆదరించడం లేదు అని జనాలు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను తమిళ భాషలో కూడా విడుదల చేశారు. తమిళ భాషలో ఈ సినిమాకు భారీ ఎత్తున థియేటర్లు దొరకలేదు అనే వాదనను కొంత మంది వినిపించారు. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా "క" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.
 

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు మొదట ప్రకటించాడు. కానీ తమిళ భాషలో ఇతర సినిమాలు విడుదలకు రెడీగా ఉండటం వల్ల తమిళ్లో ఈ సినిమాకు థియేటర్లు దొరకడం కష్టం అని ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన కాకుండా తమిళ భాషలో వేరే తేదీన విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అని కిరణ్ చెప్పుకొచ్చాడు. దానితో దేవర సినిమాకే తమిళ్లో కష్టాలు తప్పలేదు. కిరణ్ అబ్బవరం సినిమాకు కష్టాలు ఓ లెక్క అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: