యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ వన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి అయినటువంటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తోనే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఈమె ఎన్నో సినిమాలలో నటించిన ఏ సినిమా సాధించని స్థాయి విజయాన్ని దేవర మూవీ సాధించడంతో ఈమె క్రేజ్ తెలుగులో భారీగా పెరిగిపోయింది.
అలాగే ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ క్రేజ్ దేశ వ్యాప్తంగా కూడా భారీ గానే పెరిగింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు బుక్ మై షో లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పటివరకు బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన 4.7 మిలియన్ టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లనే రాబడుతుంది. అలాగే బుక్ మై షో లో కూడా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ లభిస్తున్నాయి. దానితో రాబోయే రోజుల్లో ఈ సినిమా 5 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో అందుకునే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా దేవర సినిమా టికెట్స్ కి బుక్ మై షో లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి లభించినట్లు తెలుస్తోంది.