టి సిరీస్ తో జతకట్టిన మైత్రి... స్నేహం కొనసాగేనా?

Suma Kallamadi
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయి తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఇప్పుడు మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం వలన ప్రపంచం టాలీవుడ్ వైపు చూస్తోంది. ఈ క్రమంలోనే బడా నిర్మాణ సంస్థలు తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పెద్ద నిర్మాణ సంస్థ అయినటువంటి టి సిరీస్ వారు, తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రి మూవీస్ మేకర్స్ తో మింగిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సొంత బ్యానర్ అయినటువంటి భద్రకాళి పిక్చర్స్ తో టయప్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కబీర్ సింగ్, యానిమల్ అనే సినిమాలను నిర్మించింది సదర సంస్థ.
ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు, టి సిరీస్ సంస్థ మైత్రి మూవీస్ వారితో జత కట్టినట్టు తెలుస్తోంది. మైత్రి మూవీస్ మేకర్స్ గురించి జనాలకి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో వచ్చిన బడా సినిమాలన్నీ మైత్రి మూవీస్ వారే ఎక్కువగా నిర్మించడం మనకి కనబడుతోంది. త్వరలో విడుదల కాబోతున్న పుష్ప సినిమా కూడా మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించారనే సంగతి విధితమే. ఇక ఈ సినిమాలో టి సిరీస్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టినట్టు విశ్వసినీ వర్గాల సమాచారం. అంతే కాదండోయ్... సదరు సినిమా మ్యూజిక్ రైట్స్ కూడా టీ సిరీస్ వారు కొన్నారని బోగట్టా.
ఇక మైత్రి మూవీస్ వారి గురించి మాట్లాడుకుంటే.... త్వరలో తెరకెక్కబోతున్న బడా సినిమాలు సైతం వారి చేతిలోనే ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తూ, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఫౌజీ సినిమా కూడా మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మించడం విశేషమైన విషయంగానే చెప్పుకోవాలి. అయితే ఇందులో కూడా ఈ సిరీస్ భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తుంది. అలా మైత్రి మూవీస్ వారు ఏ సినిమాను చేసిన, ఆయా సినిమాలలో పెట్టుబడి పెడతామని టి సిరీస్ ముందుకు రావడం అరుదైన విషయం గానే పరిగణించాలి. ఎందుకంటే టి సిరీస్ నిర్మాణ సంస్థ ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలను నిర్మిస్తూ వస్తోంది. అలాంటి బడా సంస్థ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాణ సంస్థతో జత కట్టడం అనేది శుభ పరిణామం అని పలువురు విశ్లేషకులు అంటున్న మాట. అయితే బాలీవుడ్ నిర్మాణ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు.. టాలీవుడ్ నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మించడం కొత్తేమీ కాదు. కానీ టీ సిరీస్ వంటి బడా నిర్మాణ సంస్థ కూడా ఇప్పుడు తెలుగువారితో సినిమాలు తీస్తుండడం, అది తెలుగు సినిమా కీర్తిని తారాస్థాయికి చేరుస్తుందనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: