ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్లు.. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరు బద్దలు కొట్టలేదుగా..!
ఎన్నీటీర్, ఏఎన్నార్ తెలియని తెలుగువాడు ఉండరు అన్నడంలో అతిశయోక్తి కాదు. విరిద్దరూ కలిసి చేసిన అనేక సినిమాలు ఇప్పటికీ హిట్ మూవీస్‌గా ఉంటాయి. వీరు తమ సోలో సినిమాలను చేస్తూనే ఈ మల్టీస్టారర్ సినిమాలతో దుమ్మురేగ్గొట్టారు. వీరిద్దరూ కలిసి మొత్తం 14 సినిమాలు చేశారు. వాటిలో దాదాపు అన్ని సినిమాలు కూడా ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూనే ఉన్నయి. ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ కలిసి చేసిన ఏ సినిమా చూసినా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా ఎంతో ఖుష్ అయిపోతారు. ఎందుకంటే సినిమాలో ఎక్కడా కూడా ఎవరూ తగ్గరు.. పెరగరు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లు ఉంటారు. అదే వాళ్ల మల్టీస్టారర్ మూవీ హిట్ ఫార్ములా కూడా. ఇద్దరు హీరోల అభిమానులను ఒకే సినిమాతో సంతృప్తి పరచడం కూడా అంత ఈజీ పని కాదు. అది చేతకాకే కొత్త తరం డైరెక్టర్లు మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉంటూన్నరు. ఇప్పటికి కూడా కథ నచ్చి హీరోలు ఒప్పుకోవడమే తప్ప డైరెక్టర్లు ఒప్పించడం అంతంత మాత్రంగానే ఉంది.
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోల్లో ఎన్టీఆర్ - ఏఎన్నార్ పేర్లు ముందు వరుసలో ఉంటాయి.. అయితే మల్టీస్టారర్ సినిమాల్లో నటించడంలో కూడా వీరిదే టాప్ రికార్డు. విరుద్ధరు కలిసి మొదటిసారిగా 1950లో పల్లెటూరి పిల్ల అనే సినిమాలో కలిసి నటించారు.. ఈ సినిమా అప్పుట్లోనే చరిత్ర సృష్టించింది .. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే సినిమాలో నటించిన సినిమాకు విప్రీతమైన క్రేజ్ వచ్చింది. అలాగే ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా అనేక ప్రాంతాల నుంచి అప్పట్లోనే ఎడ్లబండ్లపై వచ్చి సినిమాను చూసేవారు. ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తర్వాత ఇద్దరితో మల్టీస్టారర్ సినిమాలు చేయడడానికి నిర్మాతలు డైరెక్టర్లు క్యూ కట్టారు. అయితే మళ్లీ ఆ తర్వాత సంవత్సరానికి 1951లో సంస్కారం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే ఆ తర్వాత వీరిద్దరూ మళ్ళీ ముఖ్య పాత్రలో నటించే సినిమాలు కొన్నేళ్లపాటు వరుసగా ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. అలాగే 1954లో పరివర్తన , 55లో మిస్సమ్మ , 56 లో తెనాలి రామకృష్ణ , చరణదాసి, 57లో మాయాబజార్, 58లో భూకైలాస్ సినిమాలు వరుసగా ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఇవన్నీ కూడా అప్పట్లోనే భారీ కలెక్షన్ రాబట్టి హిట్స్ సినిమాలుగ నిలిచాయి.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఒక్కసారిగా ఆగాయి. మల్టీస్టారర్ సినిమాలకు దాదాపు నాలుగేళ్లు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత 1962లో ‘గుండమ్మ కథ’ సినిమాతో వీరిద్దరూ మళ్లీ కలిసి తెరపై కనిపించారు. ఈ ఒక్క సినిమా మల్టీస్టారర్ సినిమాలకు వచ్చిన నాలుగేళ్ల గ్యాప్‌ను చిటికెలో అంటే చిటికెలో మరిచిపోయేలా చేసింది. ఆ సినిమాలో ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ కంటే సూర్యకాంతం నటనకు ప్రేక్షకులు సెల్యూట్ చేశారు. ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజ నటులు కూడా ఆమె ముందు దిగదుడుపే అన్న విధంగా సూర్యకాంతంపై పొగడ్తలు కురిపించారు.ఇదిలా ఉంటే ఆ తర్వాత 1963లో శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమా వచ్చింది. ఇందులో కూడా ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ కలిసి నటించారు. కృష్ణుడిగా ఎన్‌టీఆర్ చేయగా, అర్జునుడి పాత్రలో ఏఎన్‌ఆర్ మురిపించాడు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి మల్టీస్టారర్ సినిమాలకు గ్యాప్ వచ్చింది. 1977లో చాణక్య చంద్రగుప్త సినిమాలో మళ్లీ వీరిద్దరూ కలిసి నటించారు. 1978లో రామకృష్ణులు, 1981లో సత్యం శివం చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ ఎక్కడ కలిసి నటించిన సినిమాలు రాలేదు.. అలా ఎన్టీఆర్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పటికి మల్టీస్టారర్ సినిమాలు ట్రెంట్‌లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ని కొట్టిన హీరోలు లేరు అని చెప్పాలి.