మల్టీస్టారర్స్‌లోనే కృష్ణా సెన్సేషనల్ రికార్డ్.. మూడు తరాల హీరోలతో ఇది ఆయనకే సొంతం..

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే సీనియర్ హీరోల్లో డేరింగ్ అండ్‌ డాషింగ్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక క్రేజ్‌ తెచ్చుకున్నారు. ఆయన సినీ జీవితంలో ఎన్నో  ప్రయోగాత్మక సినిమాల్లో నటించారు. ఆయన నట జీవితంలో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, మల్టీస్టారర్‌, రీమేక్‌ చిత్రాలు, రాజకీయ చిత్రాలు, సాంఘికం ఇలా ఎన్నో రకాల సినిమాల్లో భిన్నమైన ప్రయోగాలు చేశారు.   ఏ సినిమాకు ఆ సినిమా సాటి అనే విధంగా కృష్ణ తన నట జీవితంలో నటించారు. ఇప్పటికి ఆయన అందుకున్న రికార్డులు మరి ఏ హీరో అందుకోలేరు అంటే అతిశయోక్తి కాదు.

 అలాంటి కృష్ణ చేసిన ప్రయోగాలలో మల్టీస్టారర్‌ సినిమాలు కూడా ఒకటి.. బాక్సాఫీస్ వద్ద పోటా పోటీగా సాగే ఇద్దరు అగ్ర హీరోలు, అందులోనూ స్టార్స్ కలిసి నటించిన సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండేది కాదు .. హీరోగా గొప్ప స్థాయిలో ఉన్న మరో హీరోతో కలిసి నటించడానికి కృష్ణ ఎప్పుడూ వెనకడుగు వేసే వారు కాదు .. పాలన హీరోతో నేను నటించాను అనే మాటలు ఆయన డిక్షనరీలో ఉండేవి కావు .. తనకంటే సీనియర్ హీరోలతోనూ, సమకాలీకులవారితోను, తన కొడుకులతోనూ మల్టీస్టార‌ర్‌ సినిమాలు చేశారు కృష్ణ. మూడు తరాల హీరోలతో కలిసి నటించిన ఘనత కృష్ణకేే దక్కింది. ఆయన కెరీర్లో 32 కు పైగా మల్టీస్టారర్‌ సినిమాల్లో నటించారు కృష్ణ. ఆయన సినీ జీవితంలో చేసిన మల్టీ స్టార‌ర్  సినిమాలో మరి హీరో చేయలేర‌ని కూడా చెప్పవచ్చు. ఇంత‌కి కృష్ణ చేసిన మల్టీస్టార‌ర్‌ సినిమాలు ఎంటో ఇక్కడ చూద్దాం.

సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత.. ముందుగా మరో హీరోతో కలిసి నటించిన తొలి మూవీ ఇద్దరు మొనగాళ్లు.. ఈ సినిమాలో కాంతారావుతో కృష్ణ కలిసిన నటించారు. ఆ తర్వాత వీరి కాంబోలో మరో రెండు సినిమాలు కూడా వచ్చాయి. అలాగే పాతాళ భైరవి సినిమాతో ఎన్టీఆర్ నటనకు ముద్దుడైన కృష్ణ తర్వాత ఆయనతోనే కలిసి నటించే అవకాశం రావడం గొప్ప విషయంగా చెబుతుంటారు.. ఎన్టీఆర్ తో కృష్ణ నటించిన తొలి సినిమా స్త్రీ జన్మ, ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో నిలువు దోపిడీ, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు- వగలారి భర్తలు సినిమాలు వచ్చాయి.. ఇక ఈ ఐదు సినిమాల్లోనూ ఎన్టీఆర్ - కృష్ణ అన్నదమ్ములుగా నటించారు.

అలాగే కృష్ణ చదువుకునే రోజుల్లో నాగేశ్వరరావును చూసి ఆయనలా ఎప్పటికైనా హీరో అవ్వాలని కలలు క‌ని సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు కృష్ణ.. తర్వాత అక్కినేని స్ఫూర్తితోనే ఆయన హీరోగా నిలబడ్డారు. అలాంటి కృష్ణకు నాగేశ్వరావు తోనే కలిసి మంచి కుటుంబం, అక్కా చెల్లెళ్లు, హేమాహేమీలు, గురు శిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం వంటి సినిమాల్లో కలిసి నటించారు. అలాగే కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన నటుడు కృష్ణంరాజు. శోభన్‌బాబు,  మోహన్‌బాబు, కాంతారావుతో 3, శివాజీ గణేశన్‌తో 3, రజనీకాంత్‌తో 3, సుమన్‌తో 3, నాగార్జునతో 2, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్‌, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమా చేశారు. తన కొడుకులు రమేశ్‌బాబుతో 5, మహేశ్‌బాబుతో 7 చిత్రాల్లో కృష్ణ నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: