తారక్ ని ఫాలో కానున్న అఖిల్.. ఈసారైనా హిట్ దక్కేనా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్రారంభించిన కొత్తలోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ శాతం ఏ దర్శకుడికి అయితే ముందు సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయం వస్తుందో ఆ హీరోతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. అందులో భాగంగా అనేక సార్లు తారక్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశే ఎదురైన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తూ తాను కూడా విజయాలను అందుకుంటూ వస్తున్నాడు.

అందులో భాగంగా వరుస ఫ్లాప్ లలో ఉన్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇక అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ వరుస పెట్టి ఏ దర్శకుడికి ఫ్లాప్ లు ఉంటాయి ఆ దర్శకుడితో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ఇకపోతే ఈ రూట్ లోనే అక్కినేని అఖిల్ కూడా పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు విషయం లోకి వెళ్తే ... అక్కినేని అఖిల్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాడు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని మినహాయిస్తే ఏ మూవీ ద్వారా కూడా ఈయనకు మంచి విజయం దక్కలేదు. అఖిల్ తన తదుపరి మూవీ ని పూరి జగన్నాథ్ తో చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. పూరి జగన్నాథ్ ప్రస్తుతం వరుస పాపుల్లో ఉన్నాడు. ఇక అఖిల్ వరుస ప్లాప్ లో ఉన్న పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలి అని అఖిల్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

అఖిల్ , పూరి జగన్నాథ్ కాంబోలో మూవీ రాబోతుంది ఈ వార్త బయటకు రావడంతోనే అఖిల్  జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో కాబోతున్నాడు. ఆయన పందలోనే ఈయన కూడా విజయాలు అందుకుంటాడు అనే ఆశాభావాన్ని అక్కినేని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: