ఎన్నో రీమిక్ లు చేసిన పవన్ దానిని రిజెక్ట్ చేశాడు.. చివరికి అది ఇండస్ట్రీ హిట్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో రీమిక్ సినిమాలలో నటించాడు. ఎన్నో రీమిక్ మూవీల ద్వారా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కూడా తమిళ్ లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న తేరి అనే సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇలా ఎన్నో రీమిక్ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్న పవన్ కళ్యాణ్ ఒక భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న రీమిక్ అవకాశం ముందే తన దగ్గరికి వస్తే ఆయన దానిని రిజెక్ట్ చేశాడట. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మలయాళం లో నీరం అనే ఓ సినిమా వచ్చింది. ఈ సినిమా మలయాళం లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాను తెలుగులో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై చెప్పాలని ఉంది పేరుతో పవన్ కళ్యాణ్ హీరోగా రీమిక్ చేయాలి అని అనుకున్నారట. కానీ ఎందుకో ఈ సినిమా ఆగిపోయిందట. ఇక ఆ తర్వాత ఈ సినిమాను కె విజయ భాస్కర్ దర్శకత్వంలో రామోజీరావు నిర్మాణంలో నువ్వే కావాలి అనే టైటిల్ తో తరుణ్ , రీచా హీరోయిన్లుగా రూపొందించారు. 

ఇక నీరం మూవీ అధికారిక రీమేక్ గా రూపొందిన నువ్వే కావాలి సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గాని నిలిచింది. ఇక ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమా యొక్క అవకాశం మొదట పవన్ కళ్యాణ్ కి తెలుగు లో వచ్చిన కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ద్వారా తరుణ్ , రీచా కి మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: