బాలీవుడ్‌లో చిరు ఎన్ని సినిమాల్లో న‌టించారో తెలుసా..?

RAMAKRISHNA S.S.
మెగాస్టార్ చిరంజీవి అనగానే తెలుగు సినిమాలే మనకు గుర్తుకు వస్తాయి. కానీ.. చిరంజీవి తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ అనేక సినిమాలలో నటించారు. అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆయన ఎందుకో బాలీవుడ్‌లో కంటిన్యూ కాలేదు. దీనికి కారణం ఏంటి..? చిరంజీవి బాలీవుడ్ లో నటించిన హిట్ సినిమాలు ఏంటి..? అన్నది తెలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. చిరంజీవి తన అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌లో తక్కువ సినిమాల్లోనే నటించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. బీటౌన్‌ సినిమాలలో ఎక్కువగా ఎందుకు కనిపించలేదు..? అన్నది చాలామందికి ఉన్న సందేహం.

చిరంజీవి చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చాయి. 1990లో చిరంజీవి ప్రతిబంద్ అనే హిందీ సినిమాలో నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 1991లో తెలుగులో సూపర్ హిట్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమాను.. ఆజ్ కా గూండారాజ్ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన జెంటిల్మెన్ సినిమాను.. హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయింది.

ఇదే చిరంజీవి హిందీలో నటించిన చివరి సినిమా. ఆ తర్వాత చిరంజీవి బాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు. అప్పటి అగ్ర దర్శకులు మనోహన్ దేశాయ్, ప్రకాష్ మెహరా, సాజి నడియ‌డ్‌వాలా చిరంజీవికి చాలా కధలు వినిపించారు. కథ‌ బాగుంటే కచ్చితంగా చేసేవాడినని.. సినిమాకు అదే బలం.. నాకు నచ్చిన కథలు వస్తేనే చేస్తాను అని చిరంజీవి గతంలో ఓ సందర్భంలో చెప్పారు. అలా కథలలో బలం లేకపోవడం వల్లే.. బాలీవుడ్‌కు చిరంజీవి గుడ్ బై చెప్పారని.. ఆయన మాటల ద్వారా అర్థమయింది. అదే సమయంలో చిరంజీవి టాలీవుడ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసేందుకు బాలీవుడ్ మీద పెద్దగా ఆసక్తి చూపించలేదని అంటారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: