అరెరె..మళ్లీ అడ్డంగా బుక్ అయిన బాలయ్య..బూతులు తిడుతున్న జనాలు..!
అయితే ఆ వేడి చల్లారిపోయిందిలే అనుకునే లోపే మరొక ఇష్యూ తెరపైకి వచ్చింది . అఖండ 2 పూజా కార్యక్రమాలలో బాలయ్య ప్రగ్యా జైశ్వాల్ తో ప్రవర్తించిన తీరుపై కొంతమంది జనాలు నెగటివ్‌గా మాట్లాడుకుంటున్నారు . అది చాలా సరదాగా జరిగిన విషయమే అయినా జనాలు మాత్రం పెద్ద భూతద్దంలో పెట్టి చూసి బాలయ్యను కావాలనే టార్గెట్ చేసిన విధంగా మాట్లాడుతున్నారు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య= తాజాగా కమిట్ అయిన సినిమా అఖండ 2.
రీసెంట్ గానే ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు బోయపాటి. బాలయ్య ఇద్దరి కూతుర్లు స్పెషల్ అట్రాక్షన్ గా ఈ కార్యక్రమంలో నిలిచారు. అయితే ఇదే మూమెంట్లో బాలయ్య తన హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ని పలకరిస్తూ దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నట్లు ముద్దు పెట్టుకున్నట్లు కనిపిస్తారు . నిజానికి అది ఒక విష్ . చాలామంది ఫారిన్ కంట్రీస్ లో బుగ్గ ను బుగ్గ ను ఆనుస్తూ ముద్దు పెట్టినట్లు బిహేవ్ చేస్తారు. అది ఒక పలకరింపు మాత్రమే . అయితే దీనిని కావాలనే కొంతమంది జనాలు బాలయ్య పై నెగిటివ్‌గా మాట్లాడేలా ట్రీట్ చేస్తున్నారు . నిజానికి దీనికంటే దారుణంగా ఇండస్ట్రీలో ఎంతో పెద్ద హీరోలు ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి . వాళ్ళను మాత్రం లైట్‌గా వదిలేసి బాలయ్యను కావాలనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమంటున్నారు నందమూరి అభిమానులు..!