ఆ రోజు భలే ఆనందపడ్డ ఎన్టీఆర్.. జీవితంలో మర్చిపోలేని మూమెంట్..!

Thota Jaya Madhuri
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేరు . అందులో ఒకరే ఈ జూనియర్ ఎన్టీఆర్ . ప్రజెంట్ పాన్ ఇండియా ఎ లెవెల్లో సినిమాలను ఓకే చేస్తూ ఒక్కోక్క మూవీకి 100 కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎన్నో సినిమాల్లో నటించి డిజాస్టర్ అయిన ప్లాప్ మూవీస్ తన ఖాతాలో వేసుకున్నారు . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలలో మొదటి స్థానంలో ఉంటుంది ఆంధ్రావాలా.


పూరి జగన్నాథ్ చాలా స్పెషల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు . అప్పట్లో ఈ సినిమాపై నందమూరి అభిమానులు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . జూనియర్ ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని బయటపెట్టింది ఆంధ్రవాలా సినిమానే అని చెప్పాలి . చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఈ  సినిమాపై నందమూరి అభిమానులు పెట్టుకున్నారు.  అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.  చాలామంది జనాలకి ఈ సినిమా నచ్చలేదు .


కానీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి మాత్రం  నందమూరి అభిమానులు భారీ స్థాయిలో వచ్చి సందడి చేశారు . ఎంతలా అంటే అసలు ఇసుక వేస్తే రాలనంత జనం ఈ ఫంక్షన్ కి వచ్చారు . ఏకంగా యాంకర్ సుమ కూడా బిత్తర పోయింది . అంతేకాదు ఎన్టీఆర్ సైతం తనను ఇంతమంది అభిమానిస్తారా.. ఇష్టపడతారా..  అంటూ స్టేజి పైన ఎమోషనల్ అయ్యారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఆశించారు . కానీ సినిమా ఫ్లాప్ అయింది . అయినా సరే ఎన్టీఆర్ ఏ మాత్రం బాధపడలేదట . మరీ ముఖ్యంగా  తన కెరీర్ లో ఎన్నో సినిమాలు నటించిన ఆంధ్రావాలా మాత్రం సో స్పెషల్ అని ఇప్పటివరకు ఎప్పుడు కూడా అంతమంది జనాభా  ని ఏ ఈవెంట్ కు ఆయనను చూసేందుకు రాలేదు అని అందుకే ఎప్పటికీ ఆంధ్రవాలా స్పెషల్ అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: