అసలు బాలయ్య తో నాకు గొడవేంటి.. తన మనసులో మాట బయటపెట్టిన యంగ్ టైగర్..!
ఉదాహరణకు ఈ సంవత్సరం జనవరిలో నటరత్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ నివాళులర్పించారు.. తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని అంజలి ఘటించారు ఆ తర్వాత బాలకృష్ణ , రామకృష్ణ తదితరులు వచ్చి నివాళులర్పించారు. అయితే ఆ ఘాట్ వద్ద సీనియర్ ఎన్టీఆర్ , జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ , కళ్యాణ్ రామ్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు అన్ని జూ. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే బాలకృష్ణ కారెక్కి అలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. బాలకృష్ణ - ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని బాలయ్య చెబితేనే ఆ ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే బాలయ్యతో గ్యాప్ గురించి ఎన్టీఆర్ గతంలో నాన్నకు ప్రేమతో సినిమా ప్రమోషన్స్ సమయంలో జగపతిబాబు వివరించారు. బాలయ్యది మీది ఏంటి ఇష్యూ అని జగపతిబాబు తారక్‌ని ప్రశ్నించారట. “నాకేంటి అండీ ఆయనతో ప్రాబ్లమ్. నాకు ఏ సమస్యా లేదు. అసలు ప్రాబ్లం ఏంటి అనేది నాకు తెలీదు. మా నాన్నగారి బ్రదర్ ఆయన. నాకు తండ్రి లాంటి వారు. ఆయనతో నాకేం గొడవ ఉంటుంది. నేనెందుకు మనసులో పెట్టుకుంటాను. నేను ఏ విషయంలోనైనా ఓపెన్‌గానే ఉంటాను” అని జూనియర్ ఎన్టీఆర్ సమాధానమిచ్చారట. ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.