ఎన్టీఆర్ సినిమా చూసి.. జీవితంలో అలా చేయకూడదని ఫిక్స్ అయిన రాజమౌళి..!?

Amruth kumar
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పకున్నా తక్కువే.. తెలుగు సినిమా స్థాయి ని ప్రపంచ సినిమాల స్థాయికి తీసుకెళ్లడంలో రాజమౌళి ఘనత ఎంతో ఉంది.. అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ లో నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీని కంప్లీట్ చేసిన జక్కన్న త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టాన్నాడు. అయితే రాజమౌళి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రాజమౌళి దర్శకుడుగా మారకముందు తన సినిమాల్లో ఒకటి ఉండకూడదని ఎంతో ఫిక్స్ అయ్యారట. నటరత్న ఎన్టీఆర్ సినిమాలలో ఒక దారుణమైన క్లైమాక్స్ చూసి ఈ నిర్ణయానికి రాజమౌళి వచ్చారట.

ఒకవేళ రాబోయే రోజుల్లో తాను సినిమాలు తెరకెక్కిస్తే మాత్రం ఎటువంటి ఎండింగ్ కచ్చితంగా పెట్టకూడదని రాజమౌళి ఓ డెసిషన్ కి వచ్చారట. జక్కన్న చిన్నతనం నుంచి యాక్షన్ సినిమాలు చూస్తూ వాటిని బాగా ఇష్టపడే వారట. ఆయన కుటుంబంలో 13 మంది కజిన్స్ ఉండేవారు అందరిలో పెద్దవాళ్లు నెలకి 2 రెండు సినిమాలు, చిన్న వాళ్లు మాత్రం నెల‌కి ఒక సినిమా చూడాలని ఇంట్లో రూల్ ఉండేదట. ఆ రోజుల్లో వాళ్ల ఊర్లో రెండే థియేటర్లు ఉండేవట అందులో ఒక థియేటర్లో ఎన్టీఆర్ అగ్గిపిడుగు ఇంకో థియేటర్లో మంచి చెడు అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అగ్గిపిడుగు సినిమా చూసిన పెద్ద వాళ్ళందరూ సినిమాలో కత్తి ఫైట్లు యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని చెప్పారట. ఇక రాజమౌళి ఎలా అయినా ఆ సినిమా చూడాలని అనుకున్నారట. అగ్గిపిడుగు సినిమాకి వెళ్దామని అనుకుంటే మంచి చెడు సినిమాలో కూడా మంచి ఫైట్లు ఉన్నాయని అబద్ధం చెప్పి ఆ సినిమాకు తీసుకు వెళ్ళారట.యాక్షన్ సీన్స్ లేకపోవడంతో రాజమౌళి నిరాశ చెందారట. ఆఖరికి హీరో చనిపోవడం ఆ ట్రాజడీ ఎండింగ్ చూసి రాజమౌళికి కోపం వచ్చింది. అప్పటికే చిరాకుతో ఉన్న రాజమౌళి ఎన్టీఆర్ చనిపోవడం చూసి భవిష్యత్తులో కనుక సినిమాలు తీశానంటే ఇటువంటి క్లైమాక్స్ పెట్టకూడదని ఫిక్స్ అయిపోయారట.. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా ఎన్టీఆర్ సినిమా చూసి జీవితంలో ఈ విధంగా సినిమా చేయకూడదని రాజమౌళి ఫిక్స్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: