ఆమె ఫస్ట్ సినిమానే రూ.100 కోట్లు వసూల్.. కట్ చేస్తే ఓవర్‌నైట్ స్టార్..?
* అలాంటి సినిమాల వల్ల ఎంతోమంది యాక్ట్రెస్‌లకు లాభం
* వారిలో కృతి శెట్టి కూడా ఒకరు
(ఏపీ-ఇండియా హెరాల్డ్)
సినిమా ఇండస్ట్రీలో ఒక్క మంచి హిట్ కొడితే చాలు ఓవర్ నైట్ సక్సెస్ సాధించి ఎన్నో అవకాశాలను అందుకోవచ్చు. అలా వచ్చిన క్రేజ్ ఉపయోగించుకొని మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ పోతే శాశ్వతమైన సక్సెస్‌ఫుల్ కెరీర్ సొంతం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇక మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటీవల కాలంలో అలాంటి సక్సెస్ అందుకున్న హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. కృతి శెట్టి చాలా చిన్న వయసులోనే తెలుగు సినిమాల్లోకి ఒక అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. ఆమె మొదటి సినిమా ఉప్పెన చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె బేబమ్మ అనే పాత్ర చేసింది. ఈ పాత్ర చాలామందికి నచ్చింది. బేబమ్మగా అల్లరి పిల్లగా కృతి శెట్టి చాలా చక్కగా నటించింది. జలజల జలపాతం పాటలో ఈ ముద్దుగుమ్మ సూపర్ హాట్ గా కనిపించి యువతకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. చిన్న వయసులో ఉన్న తొలి సినిమా అయినా ఏ మాత్రం వెనకాడకుండా రొమాంటిక్ సీన్లలో నటించి స్క్రీన్ పై మంటలు పుట్టించింది. ఈ అమ్మడి అందానికి ఎవరైనా సరే ముగ్దులవ్వాల్సిందే. మిల్కీ బ్యూటీ తమన్నా తో సమానంగా తెల్లగా ఉంటుంది. నాజుకైనా ఫిగర్ ఆమె సొంతం.
ఉప్పెన కథ ఏంటంటే, ఆసి అనే చేపలు పట్టే వాడు బేబమ్మ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కానీ వాళ్ళ ప్రేమ కథ అంత సులభంగా సాగదు. ఎందుకంటే బేబమ్మ తండ్రి చాలా ధనికుడు. పేదవాడికి ఎంత నా కూతురినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. బేబమ్మ అతనితో తిరుగుతుందని తెలిసి ఆ మత్స్యకారులందరిపై దాడి చేస్తారు. చివరికి బేబమ్మను ఆసి తీసుకొని వెళ్తాడు. కానీ అతని పురుషాంగం కట్ చేయడం వల్ల ఆమెతో ఉండలేక పోతాడు చివరికి ఇంటి దగ్గరే విడిచి వెళ్లిపోతాడు కానీ అసలు నిజం తెలిసిన బేబమ్మ తింటూ ఉండటానికి ఇష్టపడుతుంది. ఇది ఒక గొప్ప ప్రేమ కథ లాగా చూపించారు. కృతి శెట్టి తన పాత్రని చాలా అందంగా, సహజంగా చేసింది. ఆమె నటన చూసి ప్రేక్షకులు ఎంతో ఆనందించారు. ఆమె అమాయకంగా కనిపించినా, లోపల చాలా బలమైన అమ్మాయి. ఈ పాత్రే కృతికి చాలా పేరు తెచ్చిపెట్టింది. ఉప్పెన సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. కథ కూడా ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఈ రెండూ కలిసి కృతిని ఒక్కసారిగా స్టార్ చేశాయి.