టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి
కళ్యాణ్ రామ్ హీరోగా
తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ
మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ
మూవీ ద్వారా
కాజల్ అగర్వాల్ కు భారీ స్థాయికి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ
కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన
చందమామ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలోని నటన ద్వారా
కాజల్ కి మంచి గుర్తింపు లభించింది. ఇలా కెరియర్ను మంచి స్థితిలో ముందుకు సాగిస్తున్న ఈ
బ్యూటీ మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన
మగధీర అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఇక ఈ
సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా
టాలీవుడ్ ఆల్ టైమ్
ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో
కాజల్ తన అద్భుతమైన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ
బ్యూటీ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఈ
మూవీ ద్వారా వచ్చింది. ఈ
మూవీ లో
కాజల్ అగర్వాల్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే డాన్స్ , నటన ఇలా అనేక అంశాలతో ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ
సినిమా ద్వారా ఓవర్ నైట్ లో
కాజల్ స్టార్
హీరోయిన్ అయింది. ఆ తర్వాత ఈమె ఎంతో మంది
టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇప్పటికి కూడా ఈమె
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది.