సౌందర్య: బాక్సాఫీస్ కే పూనకాలు తెప్పించిన "అమ్మోరు"..!

Pandrala Sravanthi
- మొదటి గ్రాఫిక్స్ ఎఫెక్ట్ సినిమా..
- సినిమా చూసి థియేటర్లోనే ఊగిపోయిన జనాలు..
- నిజంగానే దేవతలు ఉన్నారా అనే విధంగా చిత్రం..
- సౌందర్య క్రేజ్ ను పెంచేసిన అమ్మోరు..

 1995 వ సంవత్సరం అప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో  గ్రాఫిక్స్ అంటే అంతగా తెలియదు. ఏ సినిమా చేసిన హీరో హీరోయిన్లు చాలా వరకు రియల్ గానే నటించేవారు. డూపులు ఉండేది కావు. అందుకే అప్పట్లో హీరో హీరోయిన్లకు క్రేజ్ ఉండేది. ప్రస్తుత కాలంలో గ్రాఫిక్స్ యుగం పెరిగి హీరో హీరోయిన్ల కష్టం తక్కువ అయిపోయింది. ఏదైనా కాస్త కాంప్లికేట్ సీన్ ఉంటే డూప్ ను పెట్టి చేస్తున్నారు. అలా గ్రాఫిక్స్ లేని సమయంలో అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్  హంగులతో వచ్చినటువంటి చిత్రం అమ్మోరు. ఈ సినిమా కోడి రామకృష్ణ డైరెక్షన్లో విడుదలై సంచలమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో చేసినటువంటి సౌందర్య రమ్యకృష్ణ ల పేరు ఎక్కడికో వెళ్లిపోయాయి. అలాంటి అమ్మోరు మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
 అమ్మోరు సినిమా విషయంలో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి చాలా కష్టపడ్డారు.  విదేశాల నుంచి గ్రాఫిక్స్ టెక్నీషియన్స్ ని తెప్పించి మరీ సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉంచుకొని అద్భుతమైన టెక్నిక్స్ తో సినిమాను రూపొందించారు. ఇక ఇందులో సౌందర్య పాత్ర మహాద్భుతం. మూడున్నర ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం  50 లక్షల రూపాయల ఖర్చు పెట్టారట.1995 నవంబర్ 23న అమ్మోరు థియేటర్లోకి వచ్చింది. మొదటి రెండు వారాలు ఓ మోస్తారుగా నడిచింది కానీ ఆ తర్వాత అమ్మోరు థియేటర్లలో ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే విధంగా సినిమా అందరిని ఆకట్టుకుంది.

ఇందులో సౌందర్య కష్టాలు పడుతున్న ఒక భక్తురాలి పాత్రలో నటించింది.  ఆ సమయంలో ఒక చిన్నారి రూపంలో అమ్మోరు ప్రత్యక్షమై కష్టాలు తీర్చి  శత్రువులను హతమార్చడమే ప్రధాన కథాంశం. అమ్మోరు కోసం సౌందర్య 150 కాల్షీట్లు ఇచ్చి 40 వేల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నారట. ఈ సినిమా విజయంతో సౌందర్య కి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తే వద్దు అని చెప్పిందట.ఈ మూవీ తో సౌందర్య స్థాయి పూర్తిగా పెరిగిపోయింది. ఆమె రెమ్యూనరేషన్  కూడా అమాంతరంగా లక్షల్లోకి వెళ్లిపోయింది. ఈమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేసే స్థాయికి ఎదిగింది. అలా అమ్మోరు సౌందర్య కెరీర్ ని మార్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: