అంతఃపురం : భానుమతిగా నట విశ్వరూపం చూపించిన సౌందర్య.. ఈ తరం హీరోయిన్స్ కి ఆ నటన సాధ్యమేనా..?

murali krishna

* సౌందర్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన అంతఃపురం
* భానుమతిగా సౌందర్య నటన అద్భుతం
* కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభకు అద్దంలా నిలిచిన అంతఃపురం

అలనాటి టాప్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగులో మహానటి సావిత్రి తరువాత ఆ రేంజ్ పాపులరిటీ సంపాదించిన హీరోయిన్ గా సౌందర్య మంచి గుర్తింపు సంపాదించింది.. కన్నడ భామ అయిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మయిలా తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది.. సౌందర్య తెలుగులో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మెప్పించింది.. ప్రస్తుతం హీరోయిన్స్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతున్నారు.. దర్శకనిర్మాతలు కేవలం హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ నేడు పెద్ద పెద్ద సినిమాలలోకి తీసుకుంటున్నారు. కానీ గతంలో హీరోయిన్స్ కోసమే దర్శకులు కొన్ని పాత్రలు సృష్టించేవారు.. ఆ పాత్రలలో హీరోయిన్స్ అద్భుతంగా నటించి ఎన్నో అవార్డ్స్ సైతం అందుకునేవారు.. అలా అవార్డ్స్ అందుకున్న హీరోయిన్స్ లో సౌందర్య టాప్ లో వున్నారు.. సౌందర్య తాను నటించే ప్రతి పాత్రను తాను తప్ప అంతలా ఎవరూ నటించలేని విధంగా ఆ పాత్రను రక్తి కట్టిస్తారు.. అలా నటించిన సినిమాలలో కృష్ణవంశీ తెరకెక్కించిన అంతఃపురం ఒకటి.. మాములుగా కృష్ణ వంశీ సినిమా అంటేనే కుటుంబ బాంధవ్యాలు మరియు అనుబంధాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

ఆయన ఒక సినిమా తీస్తున్నాడు అంటే ప్రతి మనిషి కి ఎంతో బాగా కనెక్ట్ అయ్యేలా ఖచ్చితంగా ఉంటుంది.కెరీర్ మొత్తం మీద చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకులకు మదిని తాకే సినిమాలు చేసాడు.ఇక కృష్ణ వంశీ దర్శకత్వం లో వచ్చిన అంతఃపురం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...1998 లో వచ్చిన ఈ మూవీ లో ఒక హీరో అనే వ్యక్తి ఎవరు ఉండరు.కథను మాత్రమే నమ్ముకొని నిజజీవితాలకు దగ్గరగా, అందరికి అర్ధం అయ్యేలా తీర్చి దిద్దిన ఈ సినిమా కృష్ణ వంశీ కెరీర్ లో అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది.తమ్మారెడ్డి భరద్వాజ్ పర్యవేక్షణలో జెమినీ కిరణ్ నిర్మించిన ఈ సినిమాలో సౌందర్య, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, శారదా ముఖ్య పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమా లో సౌందర్య పాత్ర ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది.సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.ఈ చిత్రంలో పాటలు కూడా ఎంతో అద్భుతంగా వుంటాయి..మరి ముఖ్యంగా అసలేం గుర్తుకు రాదు అంటూ వచ్చే పాట ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉంటుంది...ఇక అంతఃపురం సినిమాకు అవార్డ్స్ పంట పండింది.., 1999 లో ఉత్తమ నటిగా సౌందర్యకు నంది అవార్డు లభించింది.. అలాగే ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా అవార్డ్స్ లభించాయి..ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రకాష్ రాజ్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: