పవన్ ను అందరూ వాడేసుకుంటున్నారు.. ఇక అకీరా మిగిలేదేంటి.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయి రేంజ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన చాలా తక్కువ కాలం నుండి మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల పాటు చాలా అపజయాలను అందుకున్నాడు. మళ్ళీ జల్సా సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ లొకి వచ్చాడు. ఇకపోతే పవన్ చాలా కాలం నుండి రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో ఈయన పార్టీ సభ్యులు భారీ ఎత్తున గెలవడంతో ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవుల్లో కూడా కొనసాగుతున్నాడు.

దానితో పవన్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను తప్పిస్తే కొత్త సినిమాలు చేసే ఆలోచనలో లేడు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా మరికొన్ని రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లోని చాలా హిట్ సినిమాల టైటిల్ను ఎవరో ఒకరు వాడేసుకుంటున్నారు. కొంత కాలం క్రితం వరుణ్ తేజ్ "తొలిప్రేమ" అనే టైటిల్ను వాడేసుకోగా ఆ తర్వాత విజయ్ దేవరకొండ "ఖుషి" అనే టైటిల్ వాడుకున్నాడు. ఇక ప్రస్తుతం నితిన్ "తమ్ముడు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇక యాంకర్ మరియు నటుడు అయినటువంటి ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ తో ఓ మూవీ ని లాంచ్ చేశాడు. ఇలా పవన్ బ్లాక్ బస్టర్ సినిమాలో టైటిల్ లను ఒకరి తర్వాత ఒకరు వాడేస్తూ ఉంటే పవన్ అభిమానులు తన కుమారుడికి ఏమైనా మిగులుస్తారా లేదా అనే ఆలోచనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: