ఏడేళ్ల రాజా ది గ్రేట్ : అమ్మింది అంతకి.. వచ్చిన లాభాలు అవే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం రాజా ది గ్రేట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ 2017 వ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి తాజాగా ఏడు సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి రాజా ది గ్రేట్ సినిమాకి నైజాం ఏరియాలో 11.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 4.15 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.91 కోట్లు , ఈస్ట్ లో 2.9 కోట్లు , వెస్ట్ లో 1.66 కోట్లు , గుంటూరు లో 1.90 కోట్లు , కృష్ణ లో 1.82 కోట్లు , నెల్లూరులో 95 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 27.83 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.30 కోట్లు , ఓవర్సీస్ లో 91 లక్షల కలెక్షన్ దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 31.04 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా 30 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా 31.04 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి 1.04 కోట్ల లాభాలను అందుకొని క్లీన్ హీట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: