ఆర్ఆర్ఆర్ వల్ల అలా నష్టపోయిన రాజమౌళి.. ఆ పొరపాటే మైనస్ అయిందా?

Reddy P Rajasekhar
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన ప్రతిభతో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా ఉన్నారు. రాజమౌళి ఏ సినిమా తీసినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను ఒంతం చేసుకోవడంతో పాటు ఆయన కీర్తిప్రతిష్టలను పెంచింది. మగధీర, బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలను తెరకెక్కించడం జక్కన్నకు మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు.
 
అయితే సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏకంగా ఇద్దరు హీరోలు నటించడంతో సాధారణంగా వచ్చే లాభాలతో పోల్చి చూస్తే జక్కన్నకు తక్కువ మొత్తంలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. అయితే మహేష్ సినిమాకు మాత్రం జక్కన్నకు కళ్లు చెదిరే లాభాలు పక్కా అని చెప్పవచ్చు.
 
మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఏకంగా 50కు పైగా భాషల్లో రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ఫస్ట్ పార్ట్ బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు అని సమాచారం. మొదట ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించాలని భావించినా కొన్ని కారణాల వల్ల వెనక్కు తగ్గారని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ రిలీజ్ కావడానికే మూడు నుంచి నాలుగేళ్ల సమయం పట్టే ఛాన్స్ ఉంది.
 
మహేష్ తో రాజమౌళి తెరకెక్కించే సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారని ఈ సినిమా టాలీవుడ్ బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న సినిమా కోసం పడుతున్న కష్టం మామూలు కష్టం కాదు. ఈ సినిమా లుక్ కోసమే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాది కంటే ఎక్కువ సమయం కేటాయించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కొరకు భారీ స్థాయిలోనే ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: