ఒక్కసారిగా అమాంతం పడిపోయిన దేవర కలెక్షన్స్.. రిలీజ్ అయిన తర్వాత ఇంత తక్కువ ఇప్పుడే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా అరవింద సమేత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తారక్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలో ఎన్టీఆర్ తో రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఇక సోలో హీరోగా దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దానితో మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇక 19 రోజుల పాటు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ మూవీ 20 వ రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అమాంతం పడిపోయాయి. 20 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 82 లక్షల మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా 19 రోజుల పాటు సూపర్ సాలిడ్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన ఈ సినిమా యొక్క కలెక్షన్లు 20 వ రోజు మాత్రం చాలా వరకు డ్రాప్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: