అక్కినేని నాగేశ్వరరావు సినిమాల మీద పిచ్చితో చిన్నతనంలోనే నాటకాల్లో చేశారు. అలా నాటకాల పిచ్చితో మెల్లిమెల్లిగా సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాల్లోకి వచ్చాక నాగేశ్వరరావుకు పెళ్లీడు వచ్చి పెళ్లి చేద్దాం అనుకునే సమయంలో ఎవరూ కూడా ఈయనకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు. ముఖ్యంగా ఆయన మేనమామ కూతురు అంటే ఎంతో ఇష్టం.కానీ సినిమాల్లో ఉండే వారికి చెడు అలవాట్లు ఉంటాయి అనే కారణంతో తన మేన మామ ఏఎన్ఆర్ కి పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోలేదట. అలా చివరికి మేన మరదల్ని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక అన్నపూర్ణతో పెళ్లయ్యాక నాగేశ్వరరావుకి చాలా కలిసి వచ్చింది.. అయితే అలాంటి నాగేశ్వరరావు థియేటర్లో అమ్మాయితో దొరికిపోయిన సమయంలో ప్రేక్షకులనుంచి వచ్చిన స్పందనకి ఆయన భార్య అన్నపూర్ణ షాకింగ్ కండిషన్ పెట్టిందట. అయితే ఈ ఈ విషయం గురించి నాగేశ్వరరావు బతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు పెళ్ళైన కొత్తలో అన్నపూర్ణ ఇంగ్లీష్ మూవీస్ చూడాలని ఉంది అని చెప్పడంతో చెన్నైలోని ఓ థియేటర్ కు తీసుకు వెళ్ళాను.
అయితే ఆ సమయం కి నేను పెద్ద హీరోనేమీ కాదు. కానీ కాస్తో కూస్తో గుర్తింపు ఉంది. ఇక సినిమా చూసే థియేటర్లో కొంతమంది నన్ను గుర్తుపట్టి నా పక్కనే ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి చాలా ఆత్రుత చూపించారు.ఇక తమిళ్ వాళ్లు కాబట్టి వాళ్లు మాట్లాడుకునే తమిళ భాష మొత్తం నా భార్యకు చెప్పాను. ఒక వ్యక్తి ఏమో నేను భానుమతితో వచ్చానని,మరో వ్యక్తి వరలక్ష్మితో వచ్చానని,ఇంకొక వ్యక్తి లేదు లేదు అంజలి కావచ్చు అంటూ ఇలా ఎంతోమంది హీరోయిన్లతో నా పేరు కలుపుతూ మాట్లాడుకున్నారు.అయితే వాళ్లు మాట్లాడిన మాటలు నా భార్యకి చెప్పాను.
దాంతో నా భార్య చాలా డిసప్పాయింట్ అయి ఇంటికి వెళ్ళాక ఇప్పటినుండి నేను మీతో ఎక్కడికి బయటికి రాను అని కండిషన్ పెట్టుకొని కూర్చుంది.ఇక చివరికి హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోస్ లో కట్టిన అన్నపూర్ణ థియేటర్ కి తప్ప బయట ఏ థియేటర్ కి కూడా సినిమా చూడడానికి వెళ్లలేదు.ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఒక సినిమా వారి మీద ఇలాంటి వార్తలు పుట్టించే సమయంలో వారి ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది అని, అసలు విషయం తెలియకుండా ఏవేవో వార్తలు రాసేస్తే వారి ఫ్యామిలీ ఎంతగా ఇబ్బంది పడుతుందో నా జీవితంలో నేను చూశాను అంటూ అక్కినేని నాగేశ్వరరావు ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం బయట పెట్టారు