డబ్బు విషయంలో ఎన్టీఆర్ జాగ్రత్తలు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..?

murali krishna
స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకుల మదిలో చిర స్థాయిలో నిలిచిపోయారు..అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీతో ఎన్టీఆర్ సిని రంగంలో అద్భుతంగా రాణించారు..ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు.. ఎన్టీఆర్ పుట్టుకతో  కోటీశ్వరుడు కాదు. తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీ లో హీరోగా రానించగలిగారు..ఆయన తరహాలోనే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మరో నటుడు మురళీ మోహన్‌. ఈయన కూడా ఎంతో క్రమశిక్షణతో ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యి.. స్టార్ హీరోగా ఎదిగారు. హీరోగా రాణిస్తూనే నిర్మాతగా కూడా మురళి మోహన్ సక్సెస్ అయ్యారు.. ఇదిలా ఉంటే మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూ ద్వారా ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ సందర్భంలో ఆయనను కలుసుకోవడం జరిగింది.. ఆయన ఎంతో ఆప్యాయంగా పలుకరించి..రండి బ్రదర్ భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నారు. 

ఎన్టీఆర్ తో కలిసి అందరం కడుపు నిండా భోజనం చేశాము. ఆ తర్వాత షూటింగ్ విశేషాలు గురించి మాట్లాడుకుంటూ వున్నాం మధ్యలో ఎన్టీఆర్ గారు ఐస్ క్రీమ్ తిందామా బ్రదర్ అని అన్నారు. సరే అని చెప్పడంతో ఓ పిల్లాడిని పిలిచి 7 ఐస్ క్రీమ్ లకు ఎంత డబ్బు అవుతుందో చిల్లరతో సహా లెక్కపెట్టి మరీ ఇచ్చారు. అది చూసి నాకు నవ్వు రావడంతో.. మురళీ ఎందుకు నవ్వుతున్నావ్ అని ఎన్టీఆర్ నన్ను అడిగారు. చిల్లర లెక్క పెట్టి మరీ ఇచ్చే బదులు ఒక 100 రూపాయలు ఇస్తే తిరిగి చిల్లర తీసుకువస్తాడు కదా సార్ అని అన్నట్లు మురళి మోహన్ తెలిపారు. దానికి ఎన్టీఆర్ కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా పోనివ్వకూడదు.. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఖర్చు విషయంలో పరిధి దాటి పోకూడదు.. డబ్బు విషయంలో నేను ఎంతో జాగ్రత్తగా వుంటాను అని ఎన్టీఆర్ అన్నట్లు మురళి మోహన్ తెలిపారు.పుట్టుకతోనే నేను ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు..నేను పాలు పోసి జీవనం సాగించే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. విజయవాడలో ఉదయాన్నే లేచి పొద్దునే పాలు పోసి గుంటూరు వెళ్లి కష్టపడి చదువుకునే వాడిని. ఇప్పుడు ఇంతటి స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు కోట్ల సంపాదన ఉంది కదా అని డబ్బుని ఎలా పడితే అలా ఖర్చు పెట్టను.. పది రూపాయలు అయినా సరే ఖర్చు చేయాల్సిన చోటే ఖర్చు చేస్తాను అని ఎన్టీఆర్ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: