NBK 109 : ఆ ట్విస్ట్ తో థియేటర్స్ షేక్.. బాలయ్య కు బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అయినట్లేనా..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించనుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బాబి ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని ఫస్ట్ అఫ్ చాలా కామెడీ సన్నివేశాలతో చాలా సరదా సన్నివేశాలతో ముందుకు వెళుతుందట. ఇక ఈ సినిమా ఇంటర్వెల్ ముందు ఒక అదిరిపోయే ట్విస్ట్ వస్తుందట. ఆ ట్విస్ట్ ను బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ ఉంటుందట.

ఇక సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలో బాలయ్య తన అద్భుతమైన డైలాగులతో , యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయే రేంజ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే బాబి ఆఖరుగా చిరంజీవి హీరోగా వాల్టేరు వీరయ్య సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో కూడా మొదటి సగ భాగంలో చిరంజీవి చాలా ఎంటర్టైనర్ గా కనిపిస్తూ ఉంటాడు. రెండవ భాగంలో అదిరిపోయే మాస్ యాంగిల్ లో కనిపిస్తాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. మరి బాబి "ఎన్బికె 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాతో బాబి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk

సంబంధిత వార్తలు: